Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.03.2022
Share:

By Village Missionary Movement

Thursday, 10-Mar-2022

దిన ధ్యానము(Telugu) 10.03.2022

అంశం:-  సాత్వికమైన నాలుక.

"సాత్వికమైన నాలుక జీవవృక్షము" - సామెతలు 15:4

రాము, సోము ఇద్దరు స్నేహితులు. సోము రాముతో ఒకరోజు నువ్వు ఎందుకు ప్రతిరోజు వాకింగ్ కు వెళ్తున్నావ్ మరియు హాస్పిటల్లో మాటిమాటికి కనిపోయిస్తున్నవు అని అడిగాడు. వెంటనే రాము నేను ఒక షుగర్ పెసెంట్ ని అందువలన రోజు ఇంజెక్షన్, మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు. వెంటనే సోము నిన్ను నీవు ఒక వ్యాధిగ్రస్తుడను అని అనుకొనవద్దు. అది ఇంకా నిన్ను బలహీన పరుస్తుంది. నీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం నిజమే కాని ఆ పతిస్థితి మారుతుంది. అందువలన కృంగిపోవలసిన అవసరం లేదు. విశ్వాసంతో మరియు నమ్మకంతో బ్రతకవచ్చు అని అన్నాడు. అవును ఇదే విధంగా మనం కూడా చాలా సమయాలలో ఈ స్థితి మారదు నేను చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను, నేను ఇలా ఉండాల్సిందే అనేటటువంటి మాటలను పలికి ఈ పరిస్థితుల్లో అవసరమైన మనో ధైర్యమును కోల్పోతున్నాము. 

పరిశుద్ద గ్రంధం సెలవిస్తుంది జీవ మరణములు నాలుక వశము, సాత్వికమైన నాలుక జీవ వృక్షము అని చెబుతుంది. అందువలన నోటి మాటలలో జాగ్రత్తగా ఉండాలి. కానాను దేశమును చూచుటకు వెళ్లిన 12 మందిలో కాలేబు, యెహోషువా అనే ఈ ఇద్దరు మాత్రమే మనము నిశ్చయముగా వెళ్లుదము, దానిని స్వాధీన పరుచుకొందుము అన్నారు. మిగిలిన 10 మంది ఆ దేశంలో ఉన్న ప్రజలు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు పెద్దవి అవి మిక్కిలి గొప్పవి. ఆ దేశమును స్వాధీన పరుచుకొనలేము అని అన్నారు. దానిని విన్న ప్రజలు అందరు సణుగుచు,  విలపించారు. అప్పుడు కాలేబు, యెహోషువా అను ఇద్దరు వారిని నిమ్మల పరిచి నిశ్చయంగా మనము అ దేశమును  స్వాధీన పరుచుకొనగలం అని అన్నారు. కాని జనులు దేవుడు చేసిన అద్బుతములు మరచి మరల సణుగుకొనడం ప్రారంభించారు. ఎందరైతే సణుగుకొన్నారో వారందరు కానాను దేశమును స్వాధీన పరుచుకొన లేకపోయారు. మనము స్వాధీన పరుచుకొనవచ్చు, నిశ్చయంగా జయించ వచ్చు అని నమ్మిన యెహోషువా, కాలేబు మాత్రమే స్వాధీన పరుచుకొన్నారు.

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు అన్ని పరిస్థితులను అనుకూలమైన దృష్టితో చూడండి. మంచి సాత్వికమైన మాటలను పలుకుదాం విజయాన్ని సాధిద్దాం. యెహోషువ, కాలేబు కానాను సొంతం చేసుకొన్న విధముగా మనము కూడా నిత్య కానాను సొంతం చేసుకొనే వరకు మేలైన, సాత్వికమైన మాటలను మాట్లాడదాం శ్రేయస్సుతో జీవిద్దాం. 
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అంత్యకాల ఉజ్జీవ ఆయుధముల వలె వాడబడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al