Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.03.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 09-Mar-2022

దిన ధ్యానము(Telugu) 09.03.2022

అంశం:-  చితిసారకపు మ్రాను చెప్పే నిజం.

"చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను" - ఆదికాండము 6:14

మాల, కవిత అనే ఇద్దరు స్నేహితులు ఒకే కళాశాలలో చదువుతున్నారు. కవిత యేసుక్రీస్తును ఎరుగని కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి. మాల తన చిన్న తనం నుండి ప్రార్థన, బైబిల్ చదువుకొని ఉత్సాహంగా నడుచుకొనే అమ్మాయి. ఈ మాల తన చుట్టూ వున్న వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతుండేది. తన కళాశాల విద్య, ఆటలు అన్నింటిలో మొదటి స్థానం సంపాదించేది. ఈమెకు వ్యతిరేకంగా తన స్నేహితురాలైన కవిత ఉంది. తన కళాశాల విద్య సమయంలో లోకంతో, లోకాశలతో కలిసి సమయాన్ని వృధా చేస్తూవుండేది. ఈ కవిత చదువులో కూడా వెనకబడి ఉండేది. 

ఒక రోజు కవిత మాలను ఒక ప్రశ్న అడిగింది. మనం ఇద్దరమూ కూడా చిన్న వయస్సు నుండే సన్నిహితులం. కాని మన ఇద్దరి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు అన్ని విషయాల్లో ఎలా మొదటి స్థానం సంపాదించ గలుగుతున్నావు అని బాధపడుతూ అడిగింది. మాల కవిత దగ్గరకు వెళ్లి నేను నన్ను సృష్టించిన నా దేవునితో నా దినసరి జీవితంలో మొదటి సమయమున గడుపుతాను. మనుష్యులతో మాట్లాడుటకంటే మొదట ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత వేచి ఉంటాను. అప్పుడు ఆయన నాతో మాట్లాడతారు. ఆయన స్వరాన్ని విని నేను ఆ రోజును మొదలు పెట్టి అన్నింటిలో విజయం సాధిస్తాను. అప్పుడు నేను లోకంలో, లోకాశాలలో చిక్కుకోకుండా అది నన్ను కాపాడుతుంది అని చెప్పింది. వెంటనే కవిత తన జీవితం ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుకుంది. 

పరిశుద్ద గ్రంధంలో యెహోవా చితిసారకపు మ్రానుతో ఆ రోజుల్లో నోవహును ఓడను చెయ్యమని చెప్పారు. ఎందుకు చితిసారకపు మ్రానునే దేవుడు ఏర్పరుచుకున్నారో తెలుసా? చితిసారకపు మ్రాను అనేది ఎంత నీరు ఉన్నప్పటికీ దానిలో గల జిగురు లాంటి జారే స్వభావంతో నీటిని మరియు నీటి పైన గల చెత్తను ఆ మ్రాను పైన అంటకుండా కాపాడుతుంది. దేవుని ఎరిగిన మనము కూడా లోకంతో కలిసి బ్రతికి నప్పటికి లోకంలో ఉన్న పాపముతో, ఆశలతో అంటించు కోకుండా మనలను మనం కాపాడుకోవాలి. ఆ రోజు చితిసారకపు మ్రానుతో చేయబడిన ఓడలో ఉన్న నోవహు కుటుంబీకుల వలె మనము కూడా లోకంతో అంటుకొనకుండ సాక్షి జీవితమును జీవించుటకు ప్రభువు సహాయంతో సిద్ధపడదమా? 
-    సిస్టర్. బి. విశాలీ గారు

ప్రార్ధన అంశం:-
యూట్యూబ్ లో ప్రసారం చెయ్యబడుతున్న కార్యకమాలు ద్వారా అనేకులు ఆశీర్వాదింప బడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet