Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.03.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 08-Mar-2022

దిన ధ్యానము(Telugu) 08.03.2022

అంశం:-  యేసుక్రీస్తు ద్వారా ప్రసంసలు పొందుకొనేవారు.

"అందుకు యేసు ఇట్లనెనుఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను" - మార్కు 14:6

యేసుక్రీస్తు యొక్క జీవిత సంఘటనలలో ఆయనను ఎదుర్కొన్న చాలా మంది స్త్రీలలో ఆయన యొక్క ప్రసంసలు పొందుకొన్నది ఎవరు అనగా? ఆయన తల మీద అత్తరు పోసిన స్త్రీయే. అయితే కొందరు ఈమె మీద కోపపడి ఈమెను గూర్చి సణుగుకొనినప్పుడు ఈమె నా యెడల మంచి కార్యమే చేసెను ఈమె తన శక్తి కొలది చేసెను అన్నారు. అంతే కాదు సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రసంసించబడును అని చెప్పారు. యేసు అంతగా పొగుటకు కారణం ఏమిటి ? ఆమె తన శక్తి కొలది యేసుక్రీస్తును అంగీకరించే విధముగా పనిని చేయడం వలనే. 

చైనా దేశంలో యవ్వన స్త్రీ అయిన నోబిజో దేవుని కుమార్తె. తాను ఆశించే విషయం కొరకు ప్రార్ధించినప్పుడు ఆమె ప్రణాళిక దేవుని ప్రణాళికకు మిక్కిలి విరుద్ధమైనది అని దేవుడు ఆమెకు తెలియపరిచారు. అప్పడు ఆమె తనను దేవుని చిత్తానికి సమర్పించు కొనినప్పుడు ఒక నిర్దిష్ట లోయ చివరి నుండి దూకి అనేకులు ఆత్మహత్య చేసుకొంటున్నారు అనియు ఆ మనస్సు విరిగిన వారికి ఈమె సొంతం అని తెలియజేసారు. వెంటనే నోబిజో ఒక పలకను తీసుకొని ఆ పనిని చేయవద్దు మొదట వచ్చి నోబిజోను కలువు యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు అని వ్రాసి దాని పైన ఆమె యొక్క చిరునామాను వ్రాసి లోయ చివరలో పెట్టారు. మొదట్లోనే అనేకులు వచ్చి నోబిజోను కలిసారు. ఆ స్త్రీ యొక్క 92వ వయస్సులోనే అనగా ఆమె మరణపు అంచుల సమయంలో 5000 మంది ఆత్మహత్య ల నుండి దేవుని ప్రేమను రుచి చూసారు. దేవుడు అంగీకరించిన ఒక పని చేయడం వలన ఆ స్త్రీ అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. దేవుని యొక్క ప్రసంసలు కచ్చితంగా ఆమెకు దొరికే ఉంటాయి. 

ప్రియమైన సహోదరీలారా! అడపిల్లగా పుట్టటం వలన దేవునికి మరియు మనుష్యులకు కూడా ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాను అని అంగలార్చు తున్నారా? బాధపడవద్దు నోబిజోకు తన ఆశను తెలియజేసిన వాడు దేవుని సన్నిధిలో వేచియుండి ప్రార్థిస్తే మిమ్మల్ని కూడా తన ఉన్నత మైన పనిలో వాడుకొంటారు. దేవుడు అంగీకరించే అంతరంగ దానధర్మాలు, సేవలు, ఉపవాస ప్రార్థనలు మీరు ఇతరులతో కలిసి చెయ్యవచ్చు. మత్తయి 5:35-36వ వచనాలలో చెప్పబడినట్లు మీ శక్తి కొలది చేసినప్పుడు నా కొరకే చేశారు అని యేసుక్రీస్తు మిమ్మల్ని పొగుడుతారు. యేసుక్రీస్తు యొక్క పొగడ్తలు పొందుకొనబోవుచున్న ప్రతి స్త్రీకి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు. 
-    శ్రీమతి. గీత రిచర్డ్.

ప్రార్థన అంశం:-
సేవ పరిచర్యలో ఉపయోగించే నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాలు చక్కగా పని చేయులాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet