Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.03.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 01-Mar-2022

దిన ధ్యానము(Telugu) 01.03.2022

అంశం:-  రోజువారి జీవితంలో విసుగు.

"నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. - ప్రసంగి 9:7

జీవితంలో మనకు వచ్చే సమస్యలన్నీ గొలియాతు వంటి పెద్ద సమస్యలు కాదు. యధావిధిగా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం దాటివెళ్ళగలిగితే దానిలో ఒక పరవశం, సంతృప్తి కలుగుతుంది. జీవితానికి ఒక అర్ధం ఉన్నట్లు అనిపిస్తుంది. కాని రోజువారీ జీవితంలో మనం ప్రతిరోజు చేసే సాధారణమైన పనులు మనకు విసుగును కలిగిస్తాయి. దినసరి పనికోసం వెళ్ళడం వండటం, పాఠాలను చదవడం వంటి పనులవలన మనకు బోర్ కొడుతుంది. మనం జీవితంలో గొప్పగా ఏమి సాధించాము? అనే ఆలోచనలలో ఈ రోజువారి పనులు మనకు భారంగా అలసటగా అనిపిస్తాయి. క్రీస్తు కొరకు గొప్ప కార్యాలనుచేసిన వారియొక్క అద్భుతమైన జీవిత చరిత్రలను చదివినప్పుడు లేదా విన్నప్పుడు మన జీవతముకుడా ఒక జీవితమేనా? ఇటువంటి నా రోజువారీ జీవితం దేవునికి ఇష్టముగా ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తూఉంటాయి. దేవుని కొరకు గొప్పకార్యాలు చేయుటకు పిలువబడిన మనము ఒక విషయమును మరచిపోకూడదు. (1కోరింథీయులకు 10: 31)

"కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి." ఈ వచనం చెప్పేది ఏమిటి మన జీవితంలో చిన్న చిన్న పనులు కూడా దేవుడైన యేసు క్రీస్తు కొరకు చేసినప్పుడు ఆయన దానిని ఇంపైన సువాసన వలె అంగీకరిస్తారా. అవును దేవుని కొరకు మనం చేసే పని చిన్నదైనా ఆయన దానిని గొప్ప గా చూస్తారు. కాని మనం పేరు సంపాదించుకొనుటకు చేసే గొప్ప గొప్ప కార్యాలు ఆయన దృష్టికి అల్పమైనవే.

ప్రియమైనవారలారా! మీరు విద్యార్థివలెనో లేదా కుటుంబమును చూసుకునే భార్య వలెనో , కంపెనీలో చేసే భర్తవలెనో లేదా సేవకునివలె పిలవబడి ఉండవచ్చు ఎవరైనా పిలవబడి స్థానం నుండి మీరు చేసే ప్రతి యొక్క పనిని నిజాయితీగా ఉత్తమముగా చేసినప్పుడు దేవుని యొక్క నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది. ఈమె చేసినది వంటే కదా, ఇతను చేసినది ఆఫీసు పనే కదా అని ప్రభువు ఎన్నడూ అనుకొనడు అందువలన ఇకపై యే ఒక్కరోజు మీరు చేసే దినసరి పనిని గూర్చి విసుగు, ప్రశ్నలు వద్దు మీ యొక్క రోజువారి జీవిత పనులన్నియు దేవుని యొక్క సన్నిధిలో ఇంపైన సువాసనగా అంగీకరించబడినవి. హల్లెలూయా! 
-    సహోదరుడు. జె.సంతోష్ గారు

ప్రార్ధనా అంశం:-
ఈ నెలంతా జరగబోయే పరిచర్యలో దేవుని హస్తం తోడుండి నడిపించులాగునా ప్రార్దిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet