Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Monday, 28-Feb-2022

దిన ధ్యానము(Telugu) 28.02.2022 (God’s creation’s special)

అంశం:-  పక్షి కూడా ఉపయోగించబడుతుంది.

"మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను" - ఫిలిప్పీయులకు 2:4

మేము ప్రవక్త అయిన ఏలియాకు ఆహారం అందించుట కొరకు దేవుని చేత పంపబడిన కాకులం. దేశంలో ఎవ్వరు మమ్మల్ని పావురం వలె ఇళ్లల్లో ముద్దుగా పెరిగే పక్షుల వలె పెంచుకోరు. ఎందుకు అంటే మేము చెడు పదార్దాలను బాగా ఇష్టపడతాం. మేము నలుపు రంగులో ఉంటాం కాని మేము చూడటానికి అందంగా ఉంటాం. మా అలవాట్లు ఏమిటి అంటే మేము ఆహారం భుజించే టప్పుడు మావారి అందరిని పిలిచి అందరితో కలిసి భుజిస్తాం. మా సమూహంలో వాలిన ఇతర పక్షులను మా పిల్లలు వలె చూస్తాం. మా సొంత వారిలో ఎవరైనా చనిపోతే మేము అంత ఒక్కటిగా చేరి దుఃఖంతో విచారిస్తాం. ఈ విధముగా మా వద్ద చాలా విధములైన మంచి లక్షణాలు ఉన్నాయి. మా మంచి లక్షణాలు ఏరిగిన దేవుడు మమ్మల్ని తన యొక్క పనుల కొరకు ఉపయోగించు కొన్నారు. మాకు కొంచం కూడా స్వార్థం లేదు అని ఎరిగిన దేవుడు మేము మంచిగా బ్రతకడం చూసిన దేవుడు మమ్మల్ని తన పనిలో ఉపయోగించు కొన్నారు అని అనుకొంటున్నాము. 

అహాబు అనే ఇశ్రాయేలు రాజుకు భయపడి రహస్యంగా దాక్కొని ఉన్న ఏలీయా అనే దేవుని ప్రవక్తకు ఉదయమున, అస్తమయంలో ఆహారం అందించడమే మా పని. ఒక రోజు లేదా రెండు రోజులు కాదు చాలా నెలలు వరకు దేవుడు మాకు అప్పగించిన పనిని చక్కగా చేసి ముగించాము. మాకు ఎంత ఆకలి వేసిన మేము ఆ ఆహారమును తినలేదు. అందువలననే దేవుడు మా గురించి మా యొక్క ఉన్నతమైన పని గురించి పరిశుద్ద గ్రంధంలో వ్రాసిఉంచారు. 

ప్రియమైన వారలారా! మాకు ఇవ్వబడిన బాధ్యతలో నిజాయితీ గల వారి వలె ఉన్నాము అంటే దానికి మా యొక్క అలవాట్లు మిక్కిలి ప్రముఖ్యమైనవి. మేము మా గురించి మాత్రమే ఆలోచించ కుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక 2:4 లో  మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను అని చెప్పబడినది గదా! మాలో ఉన్న ఈ మంచి అలవాటు ఈ ఒక్కరోజులో కలిగినది కాదు ప్రతిరోజు మేము పాటిస్తే మాత్రమే సాధ్యం అయ్యింది. 

ప్రియమైన వారలారా! మీరు కూడా మీ యొక్క సొంత కార్యములు మాత్రమే చూడక ఇతరుల కొరకు కూడా ఆలోచించండి. దానిలో దొరికే సంతోషమే చాలా గొప్పది. 
-    శ్రీమతి. భువనా ధన బాలన్ గారు

ప్రార్ధన అంశం:-
గెత్సేమనే క్యాంపస్ లో ప్రారంభించబడిన వైద్య సేవ ఈ నూతన సంవత్సరంలో విస్తరించబడేలా మరియు దీని కొరకు సమర్పించుకొన్న సేవకులు మనతో కలిసి సేవచేసేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet