Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.01.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 20-Jan-2021

దిన ధ్యానము(Telugu) 20.01.2021

మధ్య భాగంలో ఏదైనా ఉన్నదా?

"…చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను" - ఆదికాండము  16:13

భక్తి గలిగిన కుటుంబం అది. ఆ ఇంటి మధ్యలో ఉన్న గదిలో " మీరు నన్ను చూచుచున్న దేవుడు " అనే వాక్యం తగిలించబడి ఉండేది. కుటుంబ ప్రార్థనకు ముందు అందరూ ఆ వాక్యం చదివిన తరువాత కుటుంబ ప్రార్థన ప్రారంభం అయ్యేది. ఇది  తండ్రి యొక్క ఆజ్ఞ. చిన్న ప్రాయం నుండే పిల్లలు దేవుని భయభక్తులలో పెంచబడ్డారు. దేవుడు ఆ పిల్లల యొక్క జీవితములు ఆశీర్వదించారు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఒకమారు ఆర్థిక ఇబ్బంది కారణం వలన పెద్ద మొత్తాన్ని లంచంగా తీసుకున్నాడు. ఎవరికి తెలియకుండా కార్యమును ముగించుకున్న సంతృప్తితో ఎలాంటి భయము అతనికి కలుగలేదు. వాడుక ప్రకారము మీరు నన్ను చూచు చున్న దేవుడు అని చదివిన వెంటనే ఆ దినపు సంఘటనలు గుర్తుకు రాగా  కన్నీటితో దేవుని సన్నిధిలో తాను తెగించిన కార్యాన్ని ఒప్పుకున్నాడు. తరువాత రోజు ఉదయమునే ఉన్నత అధికారి దగ్గరకు వెళ్లి డబ్బును అప్పగించాడు. 

బైబిల్లో కూడా ఒక మనుష్యుడు దేవుడు తనను చూస్తున్నారు అనే భయం లేకుండా ప్రవర్తించిన ప్రవర్తన వలన ఏర్పడిన ఫలితాన్ని పరిశుద్త్మ దేవుడు వ్రాసి యున్నారు. ఆయన పేరే ఆకాను. యెరికో నుండి ఎలాంటి వస్తువును తీసుకొనకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించినప్పటికి ఆకాను అక్కడ ఉన్న వస్తువులను ఆశించి తన గుడారపు మధ్య భాగములో పాతి పెట్టెడు. ఇది ఎవరికి తెలియదు అని ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఈయన తెగించి చేసిన పాపము సమస్త ఇశ్రాయేలీయులను బాధించింది. జరిగిన యుద్ధంలో ఓటమి పాలయ్యారు. దీనికి ఆకాను యొక్క పాపమే కారణము అని దేవుడు. చెప్పినప్పుడు ఆయన పై రాళ్లు రువ్వి చంపారు. అవును దేవునికి మారుగైనది ఏమి లేదు.

దీనిని చదువుతున్న మీ యొక్క జీవితంలో విజయము లేదా అయితే మీ యొక్క గుడారము మధ్యలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదా అని పరిశీలించాలి. గుడారము అన్నది మన శరీరము, మధ్య భాగము మన హృదయము. హృదయంలో రహస్యమైన పాపము ఏదైన ఉన్నదా? ఎవరికి నేను చేసే కార్యములు తెలియదు అవి ఎన్నటికీ బయటకు రావు అని దైర్యంగా జీవిస్తున్నారా? దేవుడు మీ యొక్క అంతరంగమును చూస్తువున్నారు అనే భావం లేకుండా ఉంటున్నరా? మీ యొక్క కుటుంబంలో పిల్లలు లేదా మనవలు యొక్క జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం అవుతుందా? కారణం ఈ కార్యం అయి కూడా ఉండవచ్చు. మీ ఒక్కరి రహస్య కార్యం వలన పూర్తి కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది అనే దానికి ఆకాను ఒక హెచ్చరిక. కాబట్టి మీ యొక్క గుడారపు మధ్య భాగము శుద్దికరణ చేయుడి. జయ జీవితం జీవించుడి. 
-    శ్రీమతి. జాస్మిన్ శామ్యూల్

ప్రార్థన అంశం:
ఆఫీస్ పనికొరకు జెరాక్స్ మిషన్ అవరమై యున్నది దేవుడు దయచేసేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet