Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Wednesday, 23-Feb-2022

దిన ధ్యానము(Telugu) 23.02.2022 (God’s creation’s special)

అంశం:-  సువాసన.

"...సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ...అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును" - కీర్తనలు 133: 1-2

ఈ ప్రపంచంలో వైవిధ్యభరితమైన స్థానంలో ఉన్న దేవుని పిల్లల యొక్క ధనం, డిగ్రీ, ఆస్తి వంటి ఉన్నతమైన స్థాయిని లేదా లోటుపాటులను వెనక్కి త్రోసివేసి వారిని గౌరవించి ఒకటిగా చేరి ఒక చోట ఐక్యత కలిగి ఉండటం అనేది అహరోను తల మీద పోయబడిన అభిషేక తైలం అయిన నాతో పోల్చబడింది. అవును నేనే సువాసన ఇచ్చే అభిషేక తైలమును మాట్లాడుతున్నాను. నన్ను అధిక ధరలు కలిగియున్న అత్యంత నాణ్యమైన సువాసనలు కలుగజేసిన వస్తువులు అయిన భోళం, దాల్చిని చెక్క, లవంగాలు మరియు వివిధ రకములైన సుగంధ ద్రవ్యములు  ఇచ్చే వస్తువులతో నన్ను తయారు చేస్తారు. నా ద్వారా యూదులు దేవుని కొరకు ఏర్పరచబడిన యాజకులు, దేశాన్ని పరిపాలించే రాజులకు అభిషేకం చేస్తారు.

దేవుని పిల్లలు ఐక్యత కలిగి ఒక చోటికి కూడి వచ్చి ఆరాధించి నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద దిగుటను పరిశుద్ధాత్మ అభిషేకం అని పరిశుద్ద గ్రంధంలో మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఇంత పొగడదగిన దానిగా, విలువైన దానిగా ఉన్నానో తెలుసా? అధికమైన ధరలు కలిగిన, అత్యంత నాణ్యమైన వస్తువులు అన్నింటినీ నూరి యెహోవా చెప్పిన విధముగా సరైన పరిమానంలో కలపడం వలన సువాసన కలిగిన దానిలా ఉన్నాను. కాని ఒక బాధకరమైన విషయం ఏమిటి అంటే నా యొక్క సువాసనను పాడుచేయుటకు ఒక చచ్చిన ఈగ చాలు. 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరి సహోదరులారా! మీ కుటుంబంలో, సమాజంలో, సంఘంలో మీ గుణం ఎలా ఉంది? మీ అసూయ విడిచి వినయము కలిగి అందరితో కలిసి క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే పరిమళ తైలం వలె ఉన్నారా? లేదా సువాసనను పాడుచేసే చచ్చిన ఈగ వలె ఉన్నారా? మనము సమూహముగా వున్నప్పుడు ఇతరులతో ఐక్యత కలిగి ఉండడం అనేది కొంచం కష్టమైనది. దీనికి కారణం మన యొక్క శారీరక స్వభావమే. ముఖ్యముగా గర్వమే. కాని దేవుని బలముతో, పరిశుద్ధాత్ముని సహాయముతో వాక్యం అనే సమ్మెటతో గర్వమును పగులగొట్టి మన చుట్టూ ఉన్న వారి మధ్యలో పరిమళించే తైలముగా మనం మారుదాం.
-    బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్ గారు.

ప్రార్ధన అంశం:-
చైన్ ప్రేయర్ మూలముగా అనేక రకముల నూతన ప్రార్థనలు ప్రారంభించబడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al