Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Tuesday, 22-Feb-2022

దిన ధ్యానము(Telugu) 22.02.2022 (God’s creation’s special)

అంశం:-  విడుదల.

"బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడిన వారిని విడుదలచేయును" - కీర్తనలు 146:7

నన్ను ఎరుగని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పవచ్చు. ఇతరులను తిట్టుటకు, బరువులు మోయుటకు, పొగుడుటకు అయిన నా పేరు చెప్పకుండా ఉండనే ఉండరు. నేను ఆ స్థాయికి పేరు పొందిన దానను. పరిశుద్ద గ్రంధంలో నా గురించి వ్రాయబడిన దానిని చదివి చూడండి. 

నేను చాలా సంవత్సరాలుగా ఒక గ్రామంలో గల ఒక ఇంట్లో బందింపబడి ఉండేదానను. అయితే నేను కూడా స్వాతంత్ర్యంగా బ్రతకాలి అని ఆశపడే దానను. అలాగే ప్రజలకు మేలు చెయ్యాలి అని కూడా నాలో ఉండేది. కాని కట్టబడి ఉన్న నన్ను విడిపించే వారు ఎవరు అని చాలా కృంగిపోయాను. ఆ సమయంలో యేసుని గూర్చి నేను విన్నాను. ఆయన ప్రజలకు మేలు చేసేవాడు అని పాపము నుండి , శ్రమల నుండి, రోగముల నుండి విడుదల కలుగజేసేవాడు. ఆయన ప్రజల మీద కనికరపడి అద్భుతం చేసి చనిపోయిన వారిని ప్రాణముతో లేపే వారు అని చాలా విధములుగా ప్రజలు చెప్పుకునేవారు. దానిని విన్న నేను నాకు సహాయము చెయ్యారా? నిన్ను నేను చూడాలి అని ఆశతో హృదయ లోతుల్లో నుండి ఆయనను అడిగాను. కాని నేను ఆయనను వెతుక్కుంటూ వెళ్లలేను. అయితే ఆశ్చర్యం ఏమిటి అంటే నన్ను వెతుక్కుంటూ ఆయనే నా దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర ఉన్న మనుష్యులను పంపి మీ ఎదుట ఉన్న గ్రామములో మీరు ప్రవేశించ గానే కట్టబడి యున్న ఒక గాడిద పిల్ల కనబడును. దానిని విప్పి తోలుకొని నా యొద్దకు రండి ఎవరైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారు అని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి యున్నది అని చెప్పమన్నారు. దానిని  విన్న వెంటనే నాలో కలిగిన సంతోషానికి అవదులే లేవు. మనుష్యుల బరువులను మోస్తూ నా జీవితం అయిపోతుంది అని నేను అనుకున్నాను కాని ప్రపంచంలో ఉన్న ప్రజల పాపములు మోసి పరిష్కరించిన యేసుక్రీస్తును మోయుటకు నన్ను ఏర్పరుచుకొన్నారు అనే విషయం నాకు అంతటి సంతోషం ఇచ్చింది. ఈ రోజు లోకానికే నన్ను ఆశీర్వాదంగా నన్ను మార్చారు అనే వార్త ఇంక నన్ను అతిశయించేలా చేసింది. చిరునామా లేకుండా ఒకే స్థలములో కట్టబడి యున్న నా గురించి ఈ రోజు అందరూ మాట్లాడుకొనే స్థాయికి దేవుడైన యేసుక్రీస్తు నన్ను మార్చారు. 

దేవుని పిల్లలారా! ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవలసిన మీరు ఏదో ఒక విషయంలో కట్టుబడి ఉండవచ్చు. అది పాపము లేక వ్యాధి లేక అప్పుల బాధ ఏదో ఒకటి అయ్యి ఉండవచ్చు. కాని బయపడవద్దు. మీరు ఉన్న స్థలము నుండి యేసయ్య నాకు సహాయం చేయండి అని అడిగితే చాలు. ఆయన మిమ్మును వెతుక్కుంటూ వచ్చి మిమ్మును విడిపించి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరముగా మార్చి సంతోషకరమైన జీవితమును అనుగ్రహిస్తారు. ఆమెన్.
-    బ్రదర్. ఎస్.పి.చందన పాండి గారు.

ప్రార్ధన అంశం:-
ప్రతి సోమవారం జరిగే పరిచర్య మూలముగా సందింపబడుతున్న ఆత్మలు దేవునిలో ఇంకా లోతుగా ఏదిగేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet