Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Sunday, 20-Feb-2022

దిన ధ్యానము(Telugu) 21.02.2022 (God’s creation’s special)

అంశం:-  ప్రసార వ్యవస్థ.

"నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను" - యోహాను 4: 14

శరీరము శుద్ధి చేయుటకు శరీరము ఆరోగ్యమునకు నేను చాలా ఉపయోగపడతాను. ఒక రోజు రెండు నుండి మూడు లీటర్లు నన్ను త్రాగినప్పుడు శరీరంలో ప్రవహించే రక్తం శుద్ధి చేయబడి వ్యర్థం బయటకు పోతుంది. మీరు ఒకరోజు ఆహారం భుజించకుండా ఉండవచ్చు కాని ఒకరోజైనను నన్ను త్రాగకుండా ఉండలేరు. నేను మీకు దొరకకపోతే మీరు దాహంతో అల్లాడి పోతారు. అలాగే నాలుక పొడిబారి అలసిపోతారు కదా! అటువంటి పరిస్థితుల్లో మీ నోటినుండి వచ్చే మాట ఏమి అయి ఉంటుంది. అదే నాకు దాహం వేస్తుంది అని చెబుతారు కదా! ఇది శరీర సంబంధమైన వ్యవస్థ. 

పరిశుద్ద గ్రంధంలో మీరు సమరయ స్త్రీ గురించి చూసి ఉంటారు. ఆమె బావి యొద్దకు వచ్చినప్పుడు అదే మార్గంలో యేసుక్రీస్తు కూడా అక్కడకు వచ్చారు. ఆయన నాకు చాలా దాహంగా ఉంది. నాకు దాహమునకు ఇమ్మని ఆ స్త్రీని అడిగారు. యేసుక్రీస్తు ఒక యూదుడు సాధారణంగా యూదులు సమరయులతో సంబంధం పెట్టుకోరు. కాని ఈయన దానిని అతిక్రమించి దహమునకు ఇమ్మని అడుగుతున్నారు. కాని యేసుక్రీస్తే జీవజలము యొక్క ఊట అయి ఉన్నారు. అయితే ఎందుకు ఆయన ఆమె యొద్ద దాహమునకు నీళ్లు అడుగుతున్నారు. ఏదో ఒక ప్రణాళిక యేసులో ఉండుట నేను గ్రహించాను. ఒక వేళ ఆయనకు ఆత్మలో దాహం అయి ఉండవచ్చు. ఈ బావిలో నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొనును కాని నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనరు అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూసాను. ఆమె యొద్ద ఒకాయన వ్యక్తిగతంగా పరిచర్య చేసి ఆమె ద్వారా ఒక గ్రామాన్ని సంపాదించారు. ఈ సమరయ స్త్రీలో ఒక దాహమును కలుగజేశారు. చూడండి ఆమె బావి యొద్ద నీళ్లను చేదు కొనుట మరిచి ఊరిలోనికి పరిగెత్తుకొని పోయి జరిగిన దానిని చెప్పుట మనం చూస్తున్నాం.

ప్రియమైన దేవుని పిల్లలారా! మీరైనా నేను చెప్పినది దయచేసి కొంచం గమనించండి. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మలను గూర్చిన దాహం ఈరోజు ప్రతి ఒక్కరికి రావాలి. ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వానివలె ఉన్నారు. ఆ సమరయ స్త్రీ తన పరిస్థితిని ఒప్పుకొని మారుమనస్సు పొందింది. ఆమెలో జీవజలము ప్రవహించిన వెంటనే ఆమె యొక్క గ్రామస్తులు అందరికి ఆమె ఒక ఆశీర్వాదంగా మారింది. నేను ఒక సాదరణ నీటి లా ఒక మనుష్యుని యొక్క దాహమును తీర్చగలను అంతే కాని ప్రతి మనుష్యుడు జీవ జలమైన యేసుక్రీస్తుని కనుగొని ఆయనలో గల దాహం తీరేలా మీరు ప్రయాసపడుడి అని నేను మీకు చెబుతున్నాను. యేసుని చూసిన సమరయ స్త్రీ యొక్క మార్పును చూసినప్పుడు ఇదే నా దాహంగా మారింది. కాని జీవజలమైన యేసే మీ దహమును తీర్చగలరు. హల్లెలూయా!.
-    శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు

ప్రార్ధన అంశం:-
60 మంది మిషనరీలకు సహాయకరంగా మిషనరీ భాగస్వాములు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot betkom giriş betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet grandpashabet grandpashabet giriş grandpashabet güncel giriş grandpashabet grandpashabet giriş grandpashabet giriş güncel