Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.02.2022 (Kid’s special)
Share:

By Village Missionary Movement

Sunday, 20-Feb-2022

దిన ధ్యానము(Telugu) 20.02.2022 (Kid’s special)

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

అంశం:-  ఓడ బయలుదేరుతుంది. 

"ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది" - ప్రకటన గ్రంథం 22:12

హాలో పిల్లలు! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని నమ్ముతున్నాను. ఇది 2022వ సంవత్సరం కదా? మూడు రెండ్లు వచ్చాయి చూసారా? 2020,2021లో మీరు వేటినైతే కోల్పోయారో వాటన్నింటిని దేవుడు మూడంతలుగా తిరిగి ఇవ్వబోతున్నారు. ఆ తరువాత ఏంటి జీరో వచ్చింది కదా? మన జీవితంలో వచ్చే శ్రమలు, వ్యాధులు యేసు నామంలో పొమ్మని చెబితే వెంటనే జీరోగా మారతాయి. సరేనా జీరో అంటే ఏమి లేదు అని అర్థం కదా. సరే కథ విందమా? 

ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు తెల్లని కాగితం ఇచ్చి మీరు ప్రతి వారం కథలు వింటున్నారు కదా మీరు ఏమి నేర్చుకున్నారో దానిని వ్రాసి ఇవ్వండి అని చెప్పారు. పిల్లలు ఆ పేపర్ పట్టుకొని ఆలోచిస్తున్నారు. ఒక తమ్ముడు మాత్రం త్వరగా వ్రాసేసాడు. ఏమి వ్రాసాడో చదువుదామా? నా జీవితం ఒక ఓడ లాంటిది ఈ ఓడలో విలువైన వస్తువులు ఎక్కించి చాలా దేశాలకు తీసుకొని వెళ్లి అందజేయాలి. ఆ సామాన్లు అందుకున్న వారు సంతోషపడతారు కదా! అదేవిధంగా నా ఓడ యొక్క దర్శకుడు యేసయ్య. నాలో చాలా విలువైన ప్రతిబను ఉంచారు. వాటిని నేను వాడుకొనేటప్పుడు యేసయ్య చాలా సంతోషపడతారు. ఇదే ఆ తమ్ముడు వ్రాశాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆ తమ్ముడ్ని ఉత్సాహ పరిచారు. మీకు కూడా చాలా ప్రతిబలు ఉన్నాయిగా ఆడటం, వ్రాయటం, బొమ్మలు వేయడం, భోదించడం ఇలా యేసయ్య మీకు రకరకాల ప్రతిబలు ఇచ్చారు. కాని మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి సెల్ ఫోన్ లో ఉపయోగం లేనివి చూస్తూ సమయం వృధా చెయ్యకూడదు. మీ ప్రతిబను ఉపయోగించి వాటిని పెంచుతూనే ఉండాలి. ఓడలో ఉన్న సామాన్లు లేదా వస్తువులు చాలా దేశములకు తీసుకొని వెళ్లే విధముగా మీ ప్రతిబను యేసయ్య కొరకు ఉపయోగించేటప్పుడు మీరు అనేకులకు ఆశీర్వాదంగా మారుతారు. ఎప్పుడు సెల్ ఫోన్, టీ.వీ లను చూస్తూ మీ ప్రతిబలను మట్టిలో పాతి పెట్టకూడదు. వాటిని ఉపయోగించి నప్పుడే ఇంక ఎక్కువ ప్రతిబను సంపాదించగలం. మీరు అలా ఉపయోగించినప్పుడు మీ క్రియలకు తగిన ఫలం యేసయ్య మీకు ఇస్తారు. ఏంటి పిల్లలు యేసయ్య కొరకు మీ ప్రతిబలను వాడుటకు మీరు సిద్ధమేనా? వెరీ గుడ్. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి ఉపయోగించు కొనుటకు సిద్ధంగా ఉన్నారు. గాడ్ బ్లెస్స్ యూ. 

సహోదరి. దేబోరాల్.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al