Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Friday, 18-Feb-2022

దిన ధ్యానము(Telugu) 19.02.2022 (God’s creation’s special)

అంశం:-  ఆకు పచ్చని ముళ్ళు.

"దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను" - నిర్గమకాండము 3:4

పరిశుద్ద గ్రంధంలో ఉన్న మనుష్యులు, జంతువులు, చెట్లు అనే దేని ద్వారా అయిన దేవుడు అనేక విషయాలు నేర్పించ గలరు అని నేను ఎరిగి యున్నాను. అందువలన ఈ రోజు నేను ధైర్యముగా మీతో మాట్లాడాలి అనుకొంటున్నాను. మొదటగా నన్ను నేను పరిచయం చేసుకొంటాను. సాధారణంగా నేను ఎవరికి నచ్చను. జంతువులకు కూడా నేను నచ్చను. అందుకే నన్ను ఎవరు పట్టించుకోరు. కాని ఒక గొప్ప నాయకత్వపు పనికి మోషేను పిలుచుటకు దేవుడు నన్నే ఉపయోగించు కొన్నారు అంటే మీరు నమ్మగలుగు తున్నారా? అవును నేనే ముండ్లపొదను మాట్లాడుతున్నాను. నాతో రండి అరణ్యమునకు వెళదాం. త్వరగా ఎక్కండి ఇదే అరణ్యంలో ఉన్న దేవుని పర్వతమైన హోరేబు. ఇక్కడే నేను చాలా సంవత్సరాలుగా ఉండేదానిని. 100 డిగ్రీల వేడి అధికంగా కురిసే మంచు ఈ రెండింటిని నేను అనుభవిస్తూ పెరిగాను. సరే త్వరత్వరగా కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను. 

1. దేవుడు నా ద్వారా మోషేకు ప్రత్యక్షం అయ్యారు. అదేవిధంగా చుట్టూ వున్న ప్రజలు మీ ద్వారా దేవున్ని చూడగలరా? 

2. అగ్నిని నేను అంగీకరించాను. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని నడిపించే విధానం ఏదైనను దానిని మీరు అంగీకరిస్తున్నారా? అది సింహాల గుహ వలె లేక అగ్ని గుండంగా ఉండవచ్చు. ఇది వద్దు నేను భరించలేను అని ఆయనతో పోరాడుతున్నారా? మీ జీవితంలో వచ్చే కఠినమైన పరిస్థితుల్లో మీరు ఓపికతో సహిస్తే నిశ్చయంగా మహిమ గల కార్యం జరుగుతుంది. 

3. నేను మోషే నా దగ్గరకు వచ్చుటకు ఆకర్షించాను. అదేవిధంగా మీరు దేవుని ప్రేమతో బయట ఉన్న వారిని ఆకర్షించే వారిలా ఉన్నారా? మిమ్మును చూసేవారు ఇతరుల యొద్ద లేని దైవ స్వభావమును మీ యొద్ద చూసి మీ దగ్గరకు వస్తారా? అయ్యో మిమ్మల్ని ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతున్ననా? ప్రశ్నలు వేయడం అనేది నాలో ఉన్న ఒక కళ. కారణం నేను యెహోవాను కలిసే వరకు ఎందుకు నా జీవితంలో ముల్లులు ఎందుకు ఈ అరణ్య జీవితం, ఎందుకు ఈ ఒంటరి తనం, ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని చాలా రకాల ప్రశ్నలతో సణుగుకొనుచు ఉండే దానిని. ఏప్పుడైతే నేను యెహోవాను చూసానో ఆరోజే నా ప్రశ్నలు అన్ని మాయం అయ్యిపోయాయి. మీ జీవితంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా? ప్రభువును ఇంకా అధికముగా తెలుసుకొనుటకు ప్రయాసపడండి. ఆయనే అన్ని ప్రశ్నలకు జవాబుగా మారతారు. ఇంకా కొంచం సేపు మీతో మాట్లాడాలి అని ఉంది కానీ సమయం సరిపోలేదు. ఇంకా నా గురించి తెలుసుకోవాలి అంటే నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మరల మరల చదవండి. సరే ఇక మరి నేను వెళ్తాను బాయ్.
- బ్రదర్. జాన్ జయ రాజు గారు

ప్రార్ధన అంశం:-
గెత్సేమనే క్యాంపస్ లో ఇద్దరు ఇద్దరు మిషనరీలు కలిసి శిక్షణ పొందుట కొరకు మిషనరీలకు 60 గదులు కట్టబడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al