By Village Missionary Movement
Friday, 18-Feb-2022దిన ధ్యానము(Telugu) 18.02.2022 (God’s creation’s special)
అంశం:- పేతురు యొక్క వల.
"మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది" - మత్తయి 13:47
సాధారణముగా మేము సముద్రంలో చేపలు పట్టుటకు ఉపయోగపడతాం. నేను లేకపోతే జాలరులు విస్తారమైన చేపలు పట్టలేరు. నేను నైలాన్ దారంతో చేయబడి చాలా గట్టిగా ఉంటాను. నా యొక్క బలము నిమిత్తముగా ఎంత పెద్ద చేపను అయిన నేను పైకి తీసుకు రాగలను. చేపలు బయటకు రాకుండా పట్టుకొని ఓడ్డుకు చేర్చుతాను. మేము లోతైన స్థలములో వేయబడతాం మరియు లోతు లేని స్థలములో కూడా వేయబడతాం. ఏ స్థలంలో వేసిన నేను చేపలను తీసుకు రాగలను. మేము నిర్లక్ష్యంగా ఉండక చేపలను గట్టిగా పట్టుకొని ఒడ్డుకు చేర్చేవరకు మేము వాటిని విడిచి పెట్టము.
పరిశుద్ద గ్రంధంలో యేసు శిష్యులలో కొందరు చేపలు పట్టే జాలరులు. ఒక రోజు వారు వలలను కడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు పేతురు అనే శిష్యుని యొద్ద నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలను వేయుము అని చెప్పారు. పేతురు వల వేసిన వెంటనే రెండు దోనెలు మునుగునట్లు విస్తారమైన చేపలను సొంతం చేసుకున్నారు. దేవుని పిల్లలారా మీరు మీ సంఘంతో కలిసి ఆత్మల సంపాదన చేస్తున్నారా? మీ చేతులకు దొరికిన ఏ ఆత్మలను వదలకుండా గట్టిగా పట్టుకుంటున్నారా? మనం సేవకొరకు వెళ్లిన స్థలం కఠినమైనదిగా ఉన్నదా? అది కఠినమైనది అయినను, సులభమైనది అయినను ఆత్మల సంపాదించుటకు ఆశక్తి కలిగి ఉన్నారా? ఆత్మల సంపాదన తగ్గినట్లయితే లేదా ఆత్మలు సంఘమును విడిచి వెళ్లినట్లయితే మీరు ఒక పని చెయ్యాలి. మేము మమ్మును బాగుచేయుటకు మేము మా యజమానుని చేతికి అప్పగించు కొనినట్లు మీరు కూడా మీ లోపములను సరి చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు చేతికి మిమ్మును సమర్పించుకొనుడి. మేము మా వలలో అనేక చేపలను కాపాడుతూ ఒడ్డుకు చేర్చుతున్న విధముగా మీరు పోరాటంతో, వ్యాధితో, పేదరికంతో, అప్పులతో ఉన్నవారిని అదరించి వారికొరకు ప్రార్ధించు చున్నారా?
దేవుని పిల్లలారా! మీరు చేస్తున్న పని ఉత్తమమైనది. అది ఏమిటి అంటే నరకమునకు వెళ్తున్న ఆత్మలను కాపాడి పరలోకమునకు తీసుకొని వెళ్లే గొప్ప పని. అందువలన దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి. ఆ శక్తిగా నడుచుకొనండి. మేము పట్టే చేపలు చాలా రుచికరమైనవి అదేవిధంగా ఆత్మల సంపాదన కూడా చాలా రుచికరమైనది. అది సేవకులు మాత్రమే చెయ్యాలి అని కాదు ప్రతి ఒక్క క్రైస్తవుడు చెయ్యవలసిన పని.
- శ్రీమతి. శక్తి శకంర్ రాజ్
ప్రార్ధనా అంశం:-
మన పరిచర్యలో ఉన్న 790 మంది సేవకుల యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250