Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Thursday, 17-Feb-2022

దిన ధ్యానము(Telugu) 17.02.2022 (God’s creation’s special)

అంశం:-  అగ్ని యొక్క ఆరాటం.

"మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి" - మత్తయి 10:28

అయ్యో మమ్ములను రక్షించుటకు ఎవరు లేరా? అనే రోదన శబ్దం గల స్థలం అది. అక్కడకు వెళ్లిన ఎవరు తిరిగి రాలేరు. ఈ స్థలంలో నా యొక్క పని అధికం. మరి నేను ఎవరో తెలుసుకుంటారా? అత్యధిక ధర గల బంగారము నా వలన కరిగింప బడుతుంది. నేను వాటి యొక్క రూపమును మార్చి తరువాత అది మెరిసేలా చెయ్యగలను. ఈ విధముగా నేను కొన్ని మంచిపనులు చేయుటకు కూడా ఉపయోగపడతాను. నేను ఎవరినైనా తాకుతాను కాని నన్ను ఎవరు తాకలేరు. నేను అనుకున్నది పూర్తి చేసేస్తాను అనే గర్వం నాలో ఉంది. కాని నేను ఓడిపోయే రోజు ఒకటి వచ్చింది. 

606వ సంవత్సరంలో బబులోను దేశంలో నెబుకద్నెజరు అనే రాజు ముగ్గురు దేవుని పిల్లలకు శిక్ష విధించి నా యొద్దకు పంపి చంపేయమని ఆజ్ఞపించారు. కాని వారిని నేను ఏమి చెయ్యలేకపోయాను. వారి తల వెంట్రుకలు కూడా ముట్టుకోలేకపోయాను. నేను వారిని చూసినప్పుడు వారితో పాటు మరొక వ్యక్తి సంచరిస్తున్నారు. నేను గమనించి చూసినప్పుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను. ఆయన పైన నేను నా అధికారం చెలాఇంచలేను. ఆయన ఉన్నప్పుడు ప్రకృతి సంబంధమైనవి ఏవియు ఆయనకు వ్యతిరేకంగా లేవలేవు. ఆయన దహించు అగ్ని వలె ఉన్నారు. అప్పుడే తెలిసింది ఆయన మాత్రమే కాదు ఆయన పైన ఉన్నవారిని ఆయన కొరకు బ్రతికే వారిని ఆయన చిత్తం లేకుండా నేను ఏమి చెయ్యలేను అని .

దేవుని పిల్లలారా! నేను అగ్నిని. నేను ఇతరుల శరీరములను నశింప చెయ్యగలను. కాని వారి ఆత్మను ఏమి చెయ్యలేను. కాని మీరు మనుష్యులను దేవుని కొరకు సిద్ధ పరచగలరు. మీరు మీ యొక్క ఆత్మలో అగ్నివలె ఆశక్తి కలిగి వున్నప్పుడు మీరు నిశ్చయముగా అనేకులకు రగిలి మండేలా చేసే వారిలా మారగలరు కదా. ఇప్పుడు కనిపించే లోకంలో నాకొక చివరి పని ఉన్నది. పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3:7వ వచనంలో చెప్పబడిన విధముగా ఈ అన్యాయం, అక్రమము నిండిన లోకంలో నా కొరకు నిలువ చేయబడి ఉన్నది. దానిని నశింప జేసీ నీతి నివాసం చేసే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం రావటానికి దారి తీస్తాను. కాని భూమిని నాశనం చెయ్యటంతో నా పని ముగిసిపోలేదు. మారు మనస్సు పొందని పాపుల కొరకు నియమించబడిన నిత్య నరకంలో నేను శాశ్వతంగా మండుతూనే ఉంటాను. వేదనతో నిండిన ఆ స్థలానికి మీకు తెలిసినవారు రాకుండా ఉండుటకు వారు యేసుని ఎరిగి నమ్ముకొనుటకు మీరు సహాయం చెయ్యరా? నా అరాటమును అర్థం చేసుకొనండి. 
-    శ్రీమతి. ఉమ విలియమ్స్ గారు

ప్రార్ధన అంశం:-
తోటి సేవకులు సేవచేసే గ్రామాల్లో దేవుని మందిరాలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al