Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Wednesday, 16-Feb-2022

దిన ధ్యానము(Telugu) 16.02.2022 (God’s creation’s special)

అంశం:-  కట్టెల యొక్క అదృష్టం.

"అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను" - సంఖ్యాకాండము 17:8

మేము కాల్చడానికి కట్టెల వలె ఉపయోగపడతాం. మమ్మల్ని సాధారణంగా ఎవరు కోరుకొనని విధముగా ఉంటాం. ఒక రోజు ఎక్కువగా వర్షం పడటం వలన నేను నీటితో నన్ను ఎలాగైనా కాపాడు అని అడిగాను. కొండల నుండి వచ్చిన నీరు నన్ను కొట్టుకొనిపోయి  నాకెందుకు అని చెప్పి ప్రక్కకు త్రోసివేసింది. అప్పుడు నేను ఒక మూలన ఒదిగి ఉండేదానిని. నాకు విరామం ఎప్పుడు దొరుకుతుంది నేను కూడా మిగతా చెట్లవలె చిగురించి, పూలుపూసి, కాయలు కాసి ఫలించనా అని వెక్కి వెక్కి ఏడ్చాను. అంతే నా యొక్క ఏడ్పు నన్ను సృష్టించిన దేవునికి వినిపించింది. తరువాత ఏం జరిగిందో తెలుసా? అహరోను అనే వ్యక్తి చూసి నన్ను తీసుకొని దానిపై తన పేరును వ్రాసి దేవుని ప్రత్యక్షపు గుడారంలో నన్ను ఉంచారు. నాతో పాటుగా పదకొండు కర్రల మీద ఆయా గోత్రాల పేర్లు వ్రాయబడి అక్కడ ఉంచబడ్డాయి. ఎంత ఆశ్చర్యం ఎండి యున్న నేను చిగురించి, పువ్వులు పూసి, బాదం పండ్లను ఇచ్చాను. నేను ఒకే రోజు పువ్వులు పూసి ఫలించడానికి గల రహస్యం చెప్పనా? పరిశుద్ద గ్రంధంలో మోషే, అహరోను అనే ఇద్దరు దేవుని మనుష్యులు ఉండేవారు. వారు దేవుని సన్నిధిలో యాజకులుగా సేవ చేస్తు వారి బాధ్యతలు చక్కగా నేరవేర్చుతూ ఉండేవారు. ఇశ్రాయేలీయులలో ఉన్న 12 గోత్రముల వారు మోషే, అహరోను అనే వ్యక్తుల యొక్క నాయకత్వమునకు వ్యతిరేకంగా సణుగుచూ, వారి మీద అనేక నిందలు మోపేవారు. అందువలన ఆ పదకొండు కర్రలు కూడా దేవుని గుడారంలో సణుగుతూ ఉండేవి అందువలన అవి చిగురించ లేదు. నేను చిగురించుటకు గల కారణం నన్ను తీసుకు వచ్చిన  వ్యక్తి యొక్క విధేయత, భయ భక్తులే కారణం కావచ్చు. 

దేవుని పిల్లలారా! చాలా రోజులుగా ఏదో ఒక విషయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? అది గర్భఫలం అయి ఉండవచ్చు, ఉద్యోగం అయి ఉండవచ్చు లేదా పదవిలో అభివృద్ధి అయి ఉండవచ్చు లేదా పిల్లల వివాహ కార్యం అయి ఉండవచ్చు. కార్యం ఏదైనను మీ యొక్క ఎదురు చూపు చూడ ముచ్చటగా మారుతుంది అనేది నిశ్చయం. మన దేవుడు సమస్తమును చేయగలిగే సర్వ శక్తిమంతుడు అనే విశ్వాసంతో సణుగుకొనక దేవుని సన్నిధిలో వేచి యున్నప్పుడు సంతోషం ఖచ్చితంగా కలుగుతుంది. మీ పనులు అన్నీ చిగురిస్తాయి. మీరు పదవి, అధికారం వంటివి కోరుకోకుండా అహరోను వలె దేవుడు మీకంటూ ఇచ్చిన బాధ్యతలు సణుగుకొనకుండా నెరవేర్చినప్పుడు దేవుడు మిమ్మును వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తారు. కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును, సిద్దించిన మనోవాంఛ జీవ వృక్షం. ఆమెన్.
-    సెలెక్టెడ్

ప్రార్ధనా అంశం:-
ఒడిశా గాంధీనగర్ ఫీల్డ్ లో పరిచర్య కొరకు నాలుగు చక్రాల వాహనం కొనబడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet