By Village Missionary Movement
Tuesday, 15-Feb-2022దిన ధ్యానము(Telugu) 15.02.2022 (God’s creation’s special)
అంశం:- హెలికాప్టర్
"...ప్రాచీన స్వభావమును (ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి... నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు" - కొలస్సీయులకు 3: 9-10
స్నేహితులారా! నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? నేను నది తీరంలో ఉంటాను. నున్నగా మెరుస్తున్న నన్ను చూసి చేతిలోనికి తీసుకొనని వారు ఎవ్వరు ఉండరు. మీ ఇంటి చేపల తొట్టిలో కూడా ఉంటాను. ముఖ్యంగా బైబిల్లో ఉన్నాను. వావ్ కరెక్ట నున్నని రాయిని నేను. నా కథను చెప్పనా నేను నున్నని రాయిలా పుట్టలేదు పెద్ద బండలా ఒక కొండ పైన ఉండేదానిని. ఒకరోజు వచ్చిన ఉరుములు, మెరుపులు గల వర్షం వలన కదిలి కొండలను, చెట్లను ఢీకొడుతూ నది తీరం దగ్గరకు వచ్చియున్నాను. ఆకరహినముగా దారుణంగా ఉన్న నేను చాలా మంది కాళ్ళకు గుచ్చి గాయపరిచాను. నా దగ్గరకు వచ్చిన అనేకులకు నేను అదేవిధంగా గాయపరిచాను. ఒక రోజు వరద వచ్చి నన్ను కొట్టుకొని పోయింది. అయ్యో అని అరిచాను, ఎత్తు, పల్లం, లోతు అనే చాలా స్థలాలను తాకుతూ తీసుకొని వెల్లబడ్డాను. చివరిగా నీరు నన్ను ఒడ్డుకు తోసేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నన్ను నేను చూసుకొని ఆశ్చర్య పోయాను. నా యొక్క పదునైన భాగాలు అన్ని మొద్దుబారి నున్నగా మారాయి. అప్పుడు దూరం నుండి ఒక యవ్వనుడు రావడం నేను చూసాను అతడు సంతోషంతో నన్ను తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను ఊహించ లేకపోయాను. కొంచం సమయంలో భయంకరమైన శబ్దం వినబడింది. ఈ యవ్వనుడు వేగంగా నన్ను తీసి తన వడిసెలో నన్ను పెట్టి కొట్టాడు అప్పుడు నేను నేరుగా శత్రువు యొక్క నుదిటిని పగులగొట్టాను. గొప్ప ఉల్లాసం తరువాతే నాకు తెలిసింది ఆ యవ్వనుడు దావీదు అని మరియు క్రింద పడినవాడు గొలియాతు అని. నేను చిన్న రాయినే గాని గొలియాతుకు హెలికాప్టర్ గా కనిపించాను. చిన్న రాయిగా ఉన్న నన్ను దేవుడు ఉపయోగించి ఇశ్రాయేలీయులకు రక్షణ ఇవ్వడం చూసి దేవున్ని నేను స్తుతించాను.
నా కథను వింటున్న ప్రియమైన వారలారా! మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలి అని ఆశ పడుతున్నారా? మీ యొక్క పదునైన భాగాలు అన్నింటినీ అనగా మీ యొక్క గర్వం, కోపం, చిరాకు, చేదు వంటి వాడిని పగుల గొట్టుటకు మిమ్ములను దేవుని హస్తములకు సమర్పించుకొనండి. ఆయన మిమ్ములను అనేక పరిస్థితులు గుండా నడిపించి మిమ్ములను పగుల గొట్టి అభివృద్ధి చేసి ఆయనకు ఉపయోగపడే వ్యక్తులను మార్చుతారు. నన్నే దేవుడు ఉపయోగించు కొన్నారు అంటే మిమ్మల్ని కూడా ఆయన తప్పకుండా ఉపయోగించు కొంటారు. ఆమెన్.
- శ్రీమతి. యబన్ సంతోష్ గారు.
ప్రార్ధనా అంశం:-
ఒడిశా రాష్ట్రం వన్నా గ్రామంలో కడుతున్న ఆలయం యొక్క ఆవసరతలు అన్నీ సందింప బడేటట్లు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250