Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Monday, 14-Feb-2022

దిన ధ్యానము(Telugu) 14.02.2022 (God’s creation’s special)

అంశం:-  ప్రేమ యొక్క మరో రూపం.

"యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.... యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము" - కీర్తనలు 27:14

ఈరోజు. గులాబీలు అధికముగా అమ్మబడే రోజు. యవ్వనస్తులు తమ తమ యవ్వనస్తులతో కలిసే దినమే ఇది. ఉత్సాహమైన హృదయం, ఎదుటి వారిని చూస్తే సంతోషం. వారి యొక్క మాట్లాడే కన్నులు, చక్కని ముఖం, మితముగా మాట్లాడే మాటలు ఇవన్నీ చూసిన వెంటనే ఇతనే నా జీవిత బాగస్వామి, లేదా ఇమే నా జీవిత భాగస్వామి అని నిర్ణయించేసు కొంటున్నారు ఈ ప్రపంచం తెలియని యవ్వనస్తులు. ఎవ్వరిని చూసిన వెంటనే ప్రేమ? ఇది ఎలా జీవితమునకు సరవుతుంది. నూతన దుస్తులు కొనుటకు ఒక మంచి షోరూంకు వెళ్తున్నారు. అక్కడ తయారుచేసిన అందమైన దుస్తులు వ్రేలాడ దీసారు. వెంటనే వాటి యొక్క వెలను చెల్లించి కొనేస్తారా ఏంటి? పరిమాణం, నాణ్యత, వెల, కంపెనీ పేరు ఇవన్నీ దృష్టి లోనికి వస్తాయి కదా. ధరించి తీసివేసేస్తున్న దుస్తులనే ఇలా సెలెక్ట్ చేసినప్పుడు జీవితాంతం మనతో వచ్చే జీవిత భాగస్వామిని చూసిన వెంటనే నిర్ణయించు కోవడం తెలివిగల పనిలా అనిపించడం లేదు. సినిమాకు, సీరియల్ కు కావాలి అంటే ఇది ఒక కథ కావచ్చు కాని మన జీవితం నటన కాదు, కల కాదు. క్రైస్తవ వివాహం అనేది పాత్రో, కుండో కాదు తప్పుగా తీసుకొన్న ఇది వద్దు ఇంకొకటి కొనుక్కొంటాను అనుకోవడానికి. తప్పుడు నిర్ణయం అనేది వేరును కొరికేసే చెద పురుగులాంటిది. తల్లిదండ్రులు లేదా భక్తి గల స్నేహితుల సహాయంతో మంచి వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితానికి ఇచ్చే వరకు ఆయన పాదముల చెంత వేచి ఉండండి. 

యవ్వన వయస్సులో కనిపించే యువత భావోద్వేగాలకు లొంగిపోయి మీ జీవితాన్ని నాశనం  చేసుకోవద్దు. ఈరోజు ప్రేమ యొక్క మరో రూపం తెలుసుకోవడం చాలా అవసరం. వ్యభిచార గృహములో అమ్మబడుతున్న చాలా మంది యవ్వనులు వారి యొక్క యవ్వన ప్రేమికుల ద్వారా అమ్మబడిన వారే అని మీకు తెలుసా? ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, సమయం గడిచిన తరువాత ఆలోచించుట కంటే ఈ రోజే ఆలోచించండి. యవ్వన కాలంలో సొంత కట్టుబాటు అనేది చాలా ప్రాముఖ్యం. సొంత కట్టుబాటు లేకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమించి వివహపు కట్టుబాటులను వెనక్కు త్రోసివేసి జీవించటం అనేది నాశనమునకు నేరుగా తీసుకు వెళ్తుంది. కాబట్టి దేవుని భయముతో మిమ్మును కాపాడుకొనండి. 

యవ్వనుడా యవ్వనంలో రాయి అనే సామెత ద్వారా లక్ష్యంతో చదువు. ప్రేమించుటకు సమయం లేదు అనే బోర్డ్ ను నీ హృదయంలో అతికించుకో. కొంచం ఓర్చుకో ఆదాముకు తగిన తొడును ఇచ్చిన దేవుడు తగిన సమయంలో తగిన భాగస్వామిని నీకు కూడా ఇస్తారు. ఆమెతో జీవితాంతం సంబరాలు చేసుకోవచ్చు.
-    బ్రదర్. శామ్యూల్ రత్న స్వామి గారు

ప్రార్ధన అంశం:-
సేవ చేసే స్థలాల్లో ఉపయోగిస్తున్న నాలుగు చక్రాల మరియు ద్విచక్ర వాహనాలు మంచిగా ఉపయోగ పడేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet