By Village Missionary Movement
Sunday, 13-Feb-2022దిన ధ్యానము(Telugu) 13.02.2022 (Kid’s special)
అంశం:- ప్రత్యేకంగా చిన్న పిల్లలకు.
"వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి" - ఎఫెసీయులకు 4:29
ఒక వేటగాడు చెట్టు కొమ్మ పైన రెండు చిలుక పిల్లలు చూసి పట్టుకున్నాడు. ఒక చిలుకను ఆశ్రమంలో ఉన్న సాదువుకు ఇచ్చేసి ఇంకొక చిలుకను తన ఇంట్లో పెంచాడు. మీరు కూడా చిలుకలను పెంచారా? చక్కగా మాట్లాడతాయి కదా! అవును చెప్పిందే చెప్పే చిలుకలు అనే సామెత కూడా చెప్తారు కదా! ఏంటి పిల్లలు మీకు చిలుక అంటే చాలా ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. సరే పిల్లలు కథ విందమా?
ఒక వ్యక్తి అడవిలో ఉన్న మార్గంలో నడుస్తూ వెళ్ళాడు. చాలా అలసటగా ఉండడంతో వేటగాని ఇంటి బయట పడుకొని కొంచం సమయం కన్ను మూయాలి అనుకున్నాడు. ఆ ఇంటిలో గల కిటికీ నుండి చెడు మాటలు విని ఎవరో అని చూడటానికి లేచి కూర్చున్నాడు. మూర్ఖుడా, బుద్ధి లేనివాడా, పనికిమాలిన వాడ అని ఏవేవొ తిడుతూ ఉంది ఆ చిలుక. ఛీ ఇదేమి చిలుక అని చిరాకుగా లేచి నడవటం మొదలు పెట్టాడు. కొంచం దూరం నడచిన తరువాత సాధువు ఉన్న ఆశ్రమం ఉంది. దానిని చూసిన ఆయన సరే ఇక్కడ కొంచం సమయం విశ్రాంతి తీసుకొనవచ్చు అనుకొని సాధువు యొక్క ఇంటి ద్వారము దగ్గర ఉన్న మెట్లు దగ్గర కూర్చున్నాడు. రండి అయ్యా బాగున్నారా? కూర్చొని కొంత సేపు విశ్రాంతి తీసుకొనండి అని ఆ చిలుక మర్యాదతో, ప్రేమతో తియ్యగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి యొక్క హృదయం సంతోషంతో నిండిపోయింది. అక్కడ నుండి లేచి ఉత్సాహంగా తన ప్రయాణం మొదలు పెట్టాడు.
రెండు చిలుకలు ఒకే స్థలం నుండి తీసుకొని రాబడినవి కాని ఆరెండు వేరువేరు స్థలాల్లో పెరిగాయి. వేటగాని ఇంట్లో పెరిగిన చిలుక వారు మాట్లాడిన మాటలు విని అవే నేర్చుకొని మాట్లాడింది. మరి సాధువు ఇంట్లో పెరిగిన చిలుక అతడు మాట్లాడిన మంచి మాటలను విని మంచినే మాట్లాడింది. అదేవిధంగా మనం ఎవరితో కలిసి ఉంటామో వారి గుణమే మనకు వస్తుంది. మంచి స్నేహితులతో ప్రేమగా, ఐక్యముగా ఉండాలి. అదే సమయంలో చెడు స్నేహితులను తిరస్కరించకుండా వారి యొద్ద ఉన్న చెడు కార్యములను తిరస్కరించే విధముగా చాలా జాగ్రత్తగా ఉండాలి.
చిన్న పిల్లలారా! మంచి మాటలను మాట్లాడి మంచి స్నేహితులను సంపాదించుకొనండి. చెడు మాటలను మాట్లాడి యేసయ్యను బాధ పెట్టకుండా ఉండుటకు తిర్మనము తీసుకోవాలి సరేనా? ఏంటి పిల్లలు చేస్తారు కదా? ఈ రోజు మనం మన నోటినుండి చెడు మాటలు మాట్లాడ కూడదు అని నేర్చుకున్నాం.
- శ్రీమతి. జీవా విజయ్
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250