Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Saturday, 12-Feb-2022

దిన ధ్యానము(Telugu) 12.02.2022 (God’s creation’s special)

అంశం:-  మేఘాలు యొక్క అనుభవం.

"ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి" - నిర్గమకాండము 40:37

అరణ్యములో మేఘము:-
మేఘమునైన నేను ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి కానానుకు ప్రయాణం అయినప్పుడు 40 సంవత్సరాల పగలు నీడ వలె ఉండి కాపాడుతూ వచ్చాను. అది మాత్రమే కాదు ఏ స్థలములో కూడా ముందు వెళ్లకుండా నిలబడతాను. అక్కడ ఇశ్రాయేలీయుల పాళెం నుండి దిగుతారు నేను ఎప్పుడు బయలు దేరుతానో అప్పుడు మాత్రమే వారు బయలుదేరుతారు. నేను పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉండటం వలన నా యొక్క నడిపింపు ద్వారానే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు. ఈ రోజుల్లో మీరు కూడా మీ జీవితంలో, పరిచర్య, వివాహం, విద్య, ఉద్యోగం, ఇల్లు కట్టడం వంటి అన్ని కార్యాలలో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నడుచుకున్నట్లయితే మీరు సంరక్షణగా మరియు భద్రముగా ఉంటారు. 

ప్రకాశమానమైన మేఘము:-
మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎత్తయిన కొండమీద రూపాంతరం పొందినప్పుడు పేతురు యేసుక్రీస్తుతో ప్రభువా మీకు ఒకటియు మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు మొత్తం మూడు పర్ణశాలలు కట్టుదునని ముగ్గురిని సమానముగా భావించి మాట్లాడినప్పుడు ప్రకాశమానమైన మేఘమునైన నా యొద్దనుండి ఒక శబ్దం బయలుదేరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించు చున్నాను, ఈయన మాట వినుడి అని మాట్లాడి యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను పేతురుకు తెలియజేశాను. మరి మీరు కూడా యేసుక్రీస్తు మాత్రమే మహిమకు, ఘనతను పాత్రుడు అని గ్రహించండి. అపోస్తులకార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మేఘము ఆయనను కొనిపోయెను అని యేసుని గూర్చి చదువుతున్నాము. అపోస్తులుడైన పౌలు థెస్సలొనికయులకు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదా కాలము మనము ప్రభువుతో కూడా ఉందుము అని వ్రాయబడిన దానిని మనం ఎరిగి యున్నాము. ఈ విధముగా మేఘమునైన నా మీద మీరు కొనిపోబడి ఎల్లప్పుడు ప్రభువుతో ఉండుటకు దేవుని ముందర మీ జీవితం ఎప్పటికి మురికి, మచ్చలు అంటకుండ కాపాడుకోనండి. ఆయన రాకడలో నేను మిమ్మల్ని కలుసు కుంటాను. అప్పటి వరకు దేవుని అనుగ్రహము మరియు నడిపింపు మీతో ఉండును గాక! ఆమెన్.
-    బ్రదర్. కె. బెంజమిన్ గారు

ప్రార్ధన అంశం:-
ఆఫీసు పనిలో ఉన్నవారికి దేవుడు విశేషమైన ఆత్మతో నింపి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al