By Village Missionary Movement
Friday, 11-Feb-2022దిన ధ్యానము(Telugu) 11.02.2022 (God’s creation’s special)
అంశం:- మధ్యలో ప్రాణాన్ని కాపాడటం.
"నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" - సామెతలు 11:30
మీ అందరికి మోషే గురించి చాలా బాగా తెలుసు. ఆ మోషే యొక్క ప్రాణాన్ని కాపాడటలో నేను ముఖ్య పాత్రను వహించను. ఆదేనండి జమ్మూ పెట్టెను మాట్లాడుతున్నాను. లక్షల కొలది ఇశ్రాయేలీయులను నడిపించే ఒక నాయకుడ్ని నేను భద్రంగా తీసుకొని వెళ్తున్నాను అని నాకు తెలియదు. ఎంతో మంది చిన్న పిల్లలు మరణించి ఆ నదిలో కొట్టుకొని వెళ్తున్నప్పుడు నేను ఫరో కుమార్తె యొక్క కంట పడ్డాను. ఆ తరువాత జరిగిన సంగతులు మీకే తెలుసు. నా కెందుకో నేను అభివృద్ధి చెందే విధానం మరియు మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కూడా సరిపోలిక అనిపిస్తుంది. అదేంటో చెప్తాను వింటారా?
నీటిలో పెరిగిన నన్ను బురదలోనుండి నరికి తీస్తారు. అనగా బురద లోనుండి నన్ను వేరుచేస్తారు. మీ జీవితం కూడా మొదట పాపపు బురదలో చెత్త కుప్ప లో ఉండేది. దానిలోనుండి నరికి వేరు నుండి విడదీయబడి ఒక నూతన జీవితం జీవించడం ప్రారంభించాలి. తరువాత నన్ను సూర్య కాంతిలో ఆరబెడతారు. అదేవిధముగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు లో యొక్క వెలుగులో నీ యొక్క జన్మ స్వభావము మారాలి. ఇలా ఎండిన నాతో పెట్టెను చేయలేరు నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతాను. నాపై నీటిని చల్లి పరిపక్వత చెందించాలి. అదేవిధముగా మీరు కూడా జీవజలమైన పరిశుద్ధాత్మ అనే అభిషేకమును పొందుకొని వాక్యముద్వారా పరిపక్వత చెందాలి. పెట్టెలా తయారుచేయబడిన నాలో చిన్న చిన్నగా ఉన్న కాలీలను జిగటమన్ను మరియు కీలుతో మూసి వేసారు. అందుకే ఒక్కచుక్క నీరు కూడా లోపలికి వెళ్ళకుండా మోషే యొక్క ప్రాణాన్ని కాపాడుకున్నాను. కీలు జిగటమన్ను పెట్టె తేలియాడుటకు ఎంత ప్రాముఖ్యమో అదే విధముగా మీరు కూడా ప్రభు ప్రేమవలన కప్పబడి ఆయన కృప వలన నింపబడుట చాలా ప్రాముఖ్యం. అప్పుడే మనం సంధించే ఆత్మలను జాగ్రత్తగా పరలోకంలో చేర్చగలం. సరైనదే కదా!
అవును ప్రియమైనవారలారా! జమ్ము పెట్టె చెప్పినది సరైనదే కదా! మనము ఇన్ని పద్ధతులను దాటితేనే నశించు ఆత్మలను ఆదాయం చేయగలం. ఈ నాడు చాలామంది వ్యాధులవలన, ప్రమాదకరమైన రోగముల వలన , హత్యల వలన ప్రభువును ఎరుగకయే నరకమునకు నేరుగా వెళ్లిపోతున్నారు. ఈ సంవత్సరం లో ప్రభువైన యేసుని ఎరుగక పాపమునకు బానిసగా బ్రతికే ప్రజలను ప్రభు చెంతకు తీసుకొని వెళ్ళి ఆయన యొద్ద చేర్చే జమ్మూపెట్టె వలె నడుచుకొనుటకు సమర్పించుకొంటారా?
ప్రార్థన అంశం:-
ఆఫీస్ పనిలో వినియోగిస్తున్న కంప్యూటర్, ల్యాప్ టాప్ మరియు ప్రింటర్లు చక్కగా వినియోగ పడేటట్లు ప్రార్దిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250