Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Tuesday, 08-Feb-2022

దిన ధ్యానము(Telugu) 08.02.2022 (God’s creation’s special)

"మరలా మరలా"

"నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి" - ద్వితియోపదేశకాండము 32:18

లక్షలకొలది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తమ పిల్లలతోను తమ యొక్క బందువులతోను మరియు వారి యొక్క పశువులతోను ప్రయాణం ప్రారంభించారు. ఒక సమయంలో వారికి త్రాగడానికి నీరు లేకుండా పోయింది. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. పశువులు నీళ్లు లేక క్రింద పడిపోతున్నాయి. వాటిని చూసిన ప్రజలకు ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళను నడిపిస్తున్న మోషే మీద కోపంతో నోటి మాటలతో మోషేను గాయపరుస్తున్నారు. మోషేకు ఏమి చెయ్యాలో తెలియక దేవుని యొక్క సన్నిధిలో అడుగుతున్నారు మోషే. దేవుని మాటను పొందుకొని ధైర్యంగా తన చేతిలో ఉన్న కర్రతో  నా యొద్దకు వచ్చి నన్ను రెండు సార్లు కొట్టాడు. కొట్టిన వెంటనే నేను అందరి దాహం తీర్చాను కాని నా హృదయంలో చాలా బాధ ఉంది. నేను చాలా నమ్మకం మోషే మీద ఉంచాను. కాని నాతో మాట్లాడమని దేవుడు చెప్పినది చెయ్యకుండా నన్ను కొట్టాడు. అందరూ ప్రజలు చూస్తుండగా  ప్రజలు ద్వారా కోపం తెచ్చుకున్న మోషే ఆ కోపాన్ని  నా మీద చూపించి దేవుని మాటకు వ్యతిరేకంగా చేసాడు. అంత మంది ప్రజలు మధ్యలో మోషేను అవమాన పరచాలి అనే  ఆలోచన నాకు లేదు. నన్ను కొట్టినను దేవుని మాటకు లోబడక పోయినను వేదనలు సహించుకొని వారియొక్క ఆవసరతలు తీర్చాను. కాని హృదయంలో బాధలు ఎవరికి తెలుసు? ముఖా ముఖిగా దేవ దేవున్ని దర్శించేవాడు, దేవుని మహిమను చూసిన వాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. సూచనలు, దర్శనాలు ఎరిగి సరిగా నడిచిన వాడు. కాని  కానానుకు వెళ్లలేకపోయాడు. ఈ రోజు మీరు అనేక వేళల్లో ఆశ్రయదుర్గం అయిన యేసుక్రీస్తును మాటలతో సనుగుకొని దూషించి దేవున్ని బాధపెడుతున్నారా? లేక దేవుడు మీ మీద ఉంచిన నమ్మకానికి మరియు ఎదురు చూపులకు వ్యతిరేకంగా నడుస్తున్నారా? లేదంటే క్రీస్తును సిలువలో వేసి రోజు మేకులు కొడుతున్నారా? ఎన్ని సార్లు ఇలా మనం చేస్తాం. ఒకే ఒక్క కారణంతో మోషే కానానుకు వెళ్ల లేకపోయాడు. మరి ఈ రోజు పరమ కానానుకు   ప్రయాణంలో ఉన్న మీరు దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారా? 
-    శ్రీమతి. వసంతి రాజమోహన్

ప్రార్ధనా అంశం:-
మీడియా పరిచర్యలో  దేవుని హస్తం తోడైయుండి తన జ్ఞానంతో నడిపించేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet