By Village Missionary Movement
Friday, 04-Feb-2022దిన ధ్యానము(Telugu) 04.02.2022 (God’s creation’s special)
అంశం:- పక్షుల గృహము.
"అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే" - మార్కు 4:31
పంటలు పండించుటకు గింజలు అవసరం అని మనకు తెలుసు అలానే కొన్ని గింజలు మనం చూసి ఉంటాం కూడా. ఆవగింజను చూడని వారు ఉండనే ఉండరు అని చెప్పవచ్చు. మీ ఇంటి వంట గదిలో నేను లేకుండా మీ వంట అవ్వదు. ఈ దిన ధ్యాన సందేశంలో మిమ్మల్ని దర్శించుటకు ఆవ గింజ వచ్చి యున్నది రండి తన మాటను తన నోటనుండి విందాం.
ఆవ గింజ చిన్నది అయిన పని పెద్దది అంటారు. అవును అలానే నేను ఉన్నాను కాని నన్ను బయట చూసి తక్కువ అంచనా వెయ్యవద్దు. నా గురించి నాలో దాగి ఉన్న ఉన్నత కార్యములు ఏవో మీకు చెబుతాను శ్రద్ధగా వినండి.
భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వ శక్తిగల దేవుడే నన్ను చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భాగంలో నా గురించి చెప్పియున్నారు. అదేమిటి అంటే ఆవగింజ అంత విశ్వాసం మీలో ఉంటే అని తన శిష్యులను చూసి చెప్పారు. దీనిని చదువుతున్న మీకు కూడా ఆవగింజ అంత విశ్వాసం ఉండిన యెడల గొప్ప కార్యములను అను దినము మీ జీవితంలో చూస్తారు. బైబిల్లో అనేకమైన వాటిని చదువుతున్నారు అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు కాని మీలో విశ్వాసం లేని యెడల అది వ్యర్థమే. అందువలనే విశ్వాస హీనులను చూసి అల్ప విశ్వాసులారా అని యేసు క్రీస్తు గద్దించు చున్నారు. విశ్వసించి చూడండి అద్భుతాన్ని చూస్తారు.
దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చబడినది అని యేసుక్రీస్తు మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెబుతున్నారు. భూమిలో గల సమస్త విత్తనములలో ఆవగింజ చిన్నదిగా భూమిలో విత్తబడుతుంది. అది పెరిగి తరువాత పక్షులు నివసించ గలిగినంత పెద్ద చెట్టుగా మారుతుంది. మీరు కూడా దేవుని కొరకు విత్తబడినప్పుడు అనగా పరిచర్య స్థలములో దేవుని కొరకు ప్రయాస పడుటకు మిమ్మల్ని సమర్పించి నప్పుడు అనేక వేల కొలది ప్రజలకు దీవెనకరంగా మార్చబడతారు. మిషనరీ స్థలములో జరిగిన ఇంటి కూడికలో ఈ వాక్యం ప్రకటించబడింది. చదువులేని సెల్లమ్మ అనే స్త్రీ ఈ వాక్యమును విని తనను సమర్పించుకొన్నది. ఈ దినము అనేక మంది చిన్నారులు, యవ్వనస్తులు, పెద్దలు రక్షించబడి పెద్ద సంఘం అవ్వడానికి ఆమె కారకురాలు అయ్యారు. దీనిని చదువుతున్న మీ యొక్క జీవితంలో కూడా ప్రారంభం చిన్నదిగా ఉండవచ్చు కాని క్రీస్తు నందు సంపూర్ణ ముగింపు రాబోతుంది కాబట్టి విశ్వాసించండి. దేవుని రాజ్యం కొరకు మీరు గొప్ప కార్యం చేయుటకు దేవుడు మిమ్మల్ని వాడుకొంటారు.
- సెలెక్టెడ్
ప్రార్ధనా అంశం:-
సత్యం టీ. వి, నంబికై టీ. వి లో ప్రసారం చెయ్యబడుతున్న కార్యక్రమాల ద్వారా అనేకులు దీవించబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250