By Village Missionary Movement
Thursday, 03-Feb-2022దిన ధ్యానము(Telugu) 03.02.2022 (God’s creation’s special)
అంశం:- మరియొక అవకాశం
"ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము” - లూకా 13: 8
నేను ఒక పచ్చిక గల స్థలములో నా తోటమాలి యొక్క శ్రద్ధ కలిగిన పరామర్శలో అందంగా ఎదుగుతూ వచ్చాను. నేను నాలో గల కొమ్మలు అనేక పక్షులకు, జంతువులు నివసించే స్థలంగా ఉండేది. అన్నీ సదుపాయాలు, అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ నేను సృష్టించబడిన ఉద్దేశ్యమును నెరవేర్చలేని విధంగా జీవించి వచ్చాను. నాగురించి నాకే బాధగా ఉండేది. నేను ఎవరో మీరు కనుక్కున్నారా?
నేనే ఆ అందమైన ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టుని. నన్ను గమనించే తోటమాలి చాలా మంచి వ్యక్తి. నాకు అవసరమైన నీరు, ఎరువు, సూర్యుని యొక్క వెలుగు అన్నీ నాకు అందేటట్లు చక్కగా చూసుకున్నారు. నేనైతే పచ్చనైన ఆకులతో, కొమ్మలతో చూడటానికి అందంగా ఉన్నాను. కాని నాలో ఎలాంటి ఫలాలు లేవు ఎంత దుక్కకరము! ఇంత బాగా చూసుకున్నప్పటికి నిష్ ప్రయోజనంగా ఉన్నాను. దీనిని చదువుతున్న మీరు కూడా ఇలా ఉన్నారా? ప్రభు మీకిచ్చిన మంచి కుటుంబము, ఇల్లు, రాబడి అని సమస్తాన్ని ఇచ్చి మంచి అవకాశముతో సంతోషముతో జీవింపజేసి యున్నారుకదా! సమస్తాన్ని అనుభవిస్తున్న మీరు ఇతరులకు ప్రయోజనకరమైన జీవితం జీవిస్తున్నారా? అంజూరపు చెట్టును నాటిన ఆ తోటమాలి వేరే చెట్టును అక్కడ నాటి యుండిన యెడల అది మంచి ఫలము ఫలించి ఉండేది. అవకాశమును పొందుకున్న నేను అయితే ఆ అవకాశమును వాడుకోకుండా ఒక వ్యర్థమైన జీవితం జీవించి వచ్చాను. నా వలె మీరు కూడా మిమ్మల్ని సృష్టించిన దేవునికి భారము కలిగించే వారిగా లేక దుఃఖ పెట్టేవారిగా జీవిస్తున్నారా? నన్ను పరామర్శించిన తోటమాలి నాలో ఫలము ఏమి లేదు అని మూడు సంవత్సరాల వరకు వేచియుండి దానిని నరికి వేయుటకు అనుమతి ఇచ్చినప్పటికీ నా కొరకు బ్రతిమలాడుతున్నారు. ఇలాగే మీ కొరకు కూడా యేసుక్రీస్తు తండ్రి యొద్ద బ్రతిమలాడుట చేతనే మీరు ఈ సంవత్సరం కూడా ప్రాణముతో ఉన్నారు. ఎందుకు అంటే ఈ సంవత్సరం కూడా మీరు ఫలబరితమైన జీవితం జీవిస్తారని ఆయన ఎదురుచూస్తున్నారు. ఆత్మ ఫలములు మీ యొద్ద నుండి బయలుపరచ బడినప్పుడు అది మీ యొద్దకు చేరుకున్న వాళ్లను ఇంపైన వాళ్ళ గాను, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది కదూ. మేము ఒక వేళ ఈ సంవత్సరం ఫలించక పోతే మమ్మల్ని నరికి అగ్నిలో పడవేస్తారు అప్పడు మేము కాలి బూడిద అయిపోతాము. కాని మీకు ఇవ్వబడిన అవకాశాన్ని మీరు కోల్పోతే నిత్యము దేవునితో జీవించే ఆ నిత్య జీవాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఫలబరితమైన జీవితం జీవిద్దాం.
- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్.
ప్రార్ధనా అంశం:-
మన ప్రార్ధనా గుడారపు కట్టడ పనుల్లో పని చేస్తున్న వారి యొక్క సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250