Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.02.2022 (God’s creation’s special)
Share:

By Village Missionary Movement

Tuesday, 01-Feb-2022

దిన ధ్యానము(Telugu) 02.02.2022 (God’s creation’s special)

 

అంశం:- నిధి

 

"ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగెను" - 2తిమోతికి 3:16

 

వేద పుస్తకమైన నేను సాధారణమైన పుస్తకం కాదు, నేను ఒక అద్భుతమైన నిధి. నన్ను మూడు భాషలలో వ్రాసారు. నన్ను వ్రాయుటకు సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 40 మంది వ్యక్తుల చేత రచించబడ్డాను. వారు ఒకరికొకరు ఎన్నడును చూచుకొనలేదు కూడా. అందులో కొంత మంది చదువులేనివారు, మరికొంత మంది చేపలు పట్టేవారు, కాపరులు, వైద్యులు ఇలాంటివారే నన్ను వ్రాసారు. వారు పరిశుదాత్మ చేత ప్రేరేపించబడి నన్ను వ్రాసారు. ప్రపంచంలోనే అత్యధికంగా ముద్రించబడి పరిశోధించబడిన గ్రంధం నేనే. ప్రపంచంలో అత్యధికమైన ప్రజల చేత చదవబడిన గ్రంధం నేనే. నన్ను సంపూర్ణంగా చదువుటకు 72 గంటల సమయం పడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంధం నేనే. సుమారు 2000 సంవత్సరాలుగా నన్ను లేకుండా చెయ్యాలి అని అనేకులు తలంచారు. నన్ను కాల్చారు, చించారు అయిన గాని ఇప్పుడు 1200ల పైగా భాషల్లో ముద్రించబడి అనేకులకు ప్రయోజన కరంగా ఉంటున్నాను.

 

మీకు తెలుసా? నన్ను ప్రేమించి, చదివి దాని ప్రకారం నడుచుకున్న వారు పొందుకున్న దీవెనలు అనేకం. ఇది ప్రాణమును తెప్పరిల్ల జేస్తుంది (కీర్తన 19:7). సమాధానము ఇస్తుంది (కీర్తన 119:65). సంతోషకరము (కీర్తన 119:77). నిత్యజీవమును ఇస్తుంది (యోహాను 5:39). ఇలా అనేక ఆశీర్వాదములు మీకు కూడా కలుగుతాయి. 

 

ప్రియమైన వారలారా! అనేకుల త్యాగం చేత నేను మీ చేతికి వచ్చి యున్నాను. నన్ను ముట్టుకొంటే సాధారణమైన కాగితమే. కానీ దానిలో వ్రాయబడినవి చదివిన యెడల అదే మీకు గొప్ప ఆయుధం. నన్ను మీరు మోసిన యెడల నేను మిమ్మల్ని మోస్తాను. ఏ గ్రంథకర్త అయిన ఆ గ్రంధంతో పాటు మీతో రాడు. కానీ నన్ను రచించిన దేవుడు నాతోనే వస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే నేను ఒక పరలోకపు నిధి. వేద గ్రంధం అయిన నన్ను తలగడ క్రింద పెట్టుకొని పడుకొనుట వలన నన్ను ముట్టుకొని నమస్కరించుట వలన దేవుని యొక్క బలాన్ని మీరు పొందుకోలేరు. దానికి మారుగా నాలో ఉన్న వాక్యాన్ని ధ్యానించి, ప్రేమించి దాని ప్రకారం తన జీవితాన్ని సరిచేసుకొనే వాళ్ళు ఖచ్చితంగా దేవుని బలాన్ని పొందుకుంటారు. కాబట్టి నన్ను ఆదివారం మాత్రం బయటకు తీయకుండా అనుదినం తీసి చదివి ధ్యానించి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. కచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని దీవిస్తారు. ఆమెన్.

- బ్రదర్. పి. శివ

 

ప్రార్ధన అంశం:-

పరిశుద్ధతతో ఎదుగుతున్న సంవత్సరంగా ప్రకటించబడిన ఈ సంవత్సరంలో యవ్వనస్తులు అందరూ పరిశుద్ధతతో జీవించులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet