Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.01.2022
Share:

By Village Missionary Movement

Sunday, 30-Jan-2022

దిన ధ్యానము(Telugu) 31.01.2022

 

అంశం:- జ్ఞాపకము చేసుకొనుము. 

 

"లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి" - లూకా 17:32

 

ఒక కుటుంబము యొక్క దీవెన మరియు శాపమునకు స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వారిగా ఉంటారు. కాబట్టి బైబిల్లో కూడా ఇద్దరు స్త్రీలు హెచ్చరిక పలకల వలె మన ముందు ఉంచి వాళ్ళను జ్ఞాపకము చేసుకొనుడి అని బైబిల్ మనకు బోధిస్తుంది. వల్లే క్రింద ఉన్న స్త్రీలు. 

 

లోతు భార్య:- 

ఈమె నీతిమంతుడైన లోతు యొక్క భార్య. దేవుని కనికరము చేత సొదొమో నుండి తప్పించబడుటకు కనికరము పొందుకున్న వ్యక్తి. విడిచిపెట్టి వచ్చిన సొదొమో మీద ఆశ, కోరిక, దురాశ ఉండుట వలన వెనుకకు తిరిగి చూడకుము అనే దేవుని ఆజ్ఞను అధిగమించి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒక వేళ ఆమె తన భర్త నీతిమంతుడైన లోతు మాట విని ఆయనతో నడిచి ఉంటే ఆమె యొక్క కుమార్తెల ద్వారా మోయాబీయులు, ఆమోనీయులు అనే ఇద్దరు శాపకరమైన సంతతులు వచ్చేవి కాదు. ఒక కుటుంబం యొక్క నాయకురాలు మంచి మాదిరి కరంగా ఉండి ఆమె యొక్క కుటుంబం దీవించబడాలి అంటే దేవుని ఆజ్ఞను అధిగమించకూడదు. రక్షించ బడటానికి ముందు కనబడిన మోసగించే దురాశలు అనే పాడుచేసే పాత మనిషిని విడిచిపెట్టి దేవుని రూపంలో సృష్టించబడిన నూతన మనుష్యుని ధరించుకోవాలి. 

 

మిర్యాము :-

ఈమె దేవుని చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తి అలానే ప్రవక్తిని కూడా. ఇలాంటి విశేష పిలుపును అందుకొన్న అమెలోను సణుగుకొనే ఆత్మ ఉండేది. 6 సంవత్సరాలు చిన్న వాడైన తన సహోదరుడు మరియు దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట వలన కుష్టు రోగిగా మారింది. దేవుడు మిర్యాము చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుడి అని ద్వితీయోపదేశ కాండం 24:9 లో బైబిల్ చెబుతుంది. సణుగుకొన్న ఇశ్రాయేలీయులను మరణ సంహార దూత నాశనం చేసింది. కాబట్టి మీరు సణుగుకొనకుడి అని బైబిల్ చెబుతుంది. కాబట్టి సమస్త కార్యములలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించే మనస్తత్వం సణుగుకొనే కార్యమునకు చోటు ఇవ్వకుండా చేస్తుంది. సేవకుని పైన నేరం మోపుట మానేద్దాం. సేవకుని పైన నేరం మోపిన మిర్యామును భయముతో, వణుకుతోను జ్ఞాపకం చేసుకొందాం. వెనక్కు చూసి ఉప్పు స్తంబంగా మారిపోయిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని హెచ్చరికతో జీవిద్దాం. 

- శ్రీమతి. గీతా రిచర్డ్.

 

ప్రార్ధనా అంశం:-

ప్రతి ఉదయం 5 గంటల సమయానికి జరుగుతున్న స్వస్థత ఆరాధనలో పాల్గొనే వ్యక్తులను దేవుడు తన బలముతో నింపి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio betpipo giriş holiganbet güncel giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpipo