Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.01.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 30-Jan-2022

దిన ధ్యానము(Telugu) 30.01.2022 (Kids Special)

 

అంశం:- ఎవరు వీడు

 

ప్రత్యక్షంగా చిన్న పిల్లల కోసం.

 

"ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై" - కీర్తనలు 113:7

 

బర్నబాటు అనే చిన్న బాలుడు ఎప్పుడు చురుకుగా ఉంటాడు. ఈయన తోబుట్టువులు 13 మంది. ఎప్పుడు ఇల్లు నవ్వులతో, గోడవలతో గోల గోలగా ఉంటుంది. నాన్న గార్లో పనికి వెళ్ళినప్పుడుడల్లా నేను వస్తాను అని బర్నబాటు గోల పెడతాడు. నాన్న ఒక దినము ఆ బాబుని తనతో పాటు ఆఫీసుకు తీసుకువెళ్లారు. ఆలస్యంగా వచ్చినందుకు మేనేజర్ గార్లోను తిట్టారు. నాన్న ఆ మేనేజర్ దగ్గర తిట్లు కాయడం చూసిన బర్నబాటు కి చాలా దుఃఖంగా ఉండేది. మేనేజర్ వీడికి గొప్ప వ్యక్తిగా కనిపించాడు. కాబట్టి ఈయన బాగా చదివి మెనేజర్ అవ్వాలి అని ఆలోచించాడు. మీకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి కదా డాక్టర్ అవ్వాలి అని, ఇంజినీర్ అవ్వాలి అని, నర్స్ అవ్వాలి అని, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అని అందరూ ఆశ పడుతుంటారు కదా? 

 

ఒక దినము ఆ మేనేజర్ ఇంట్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. గార్లో కూడా ఆ విందుకు ఆహ్వానించ బడి ఆ విందుకు వెళ్లారు. బర్నబాటు మాత్రం మేనేజర్ ఎక్కడ అని వెతుకుతూ ఉన్నాడు. మిగిలిన పిల్లలు అందరూ తినేసి అడుకొంటు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మేనేజర్ ను చూడాలి అని, ఆయన వలె మారాలి, ఆయనే నా హీరో అని బర్నబాటు అనుకున్నాడు. అక్కడ మేనేజర్ ని చూసాడు కానీ అక్కడ మేనేజర్ ని ఒకాయన తిడుతుండడం చూసాడు. అప్పుడు ఈయన కంటే గొప్పవాడు ఇంకొకరు ఉన్నారా? అని నాన్న దగ్గరకు వెళ్ళి అడిగాడు. ఆయన కంటే గొప్పవాడు ఓనర్ అని చెప్పినప్పుడు దేశంలోనే గల ఉన్నత పదవీ ఏమిటి అని అడిగాడు. అందుకు నాన్న నవ్వుకొని రాజు యొక్క సింహసనమే గొప్పది అని అన్నారు. ఆ దినము మొదలుకొని నేను రాజు అవ్వాలి అని ఆలోచించాడు. బడి చదువు పూర్తి చేసుకొని సైన్యంలో చేరాడు. ఆయన కఠినమైన ప్రయాస వలన త్వరగా సైన్యం యొక్క నాయకుడు అయ్యాడు. సరైన పరిస్థితి వచ్చింది దానిని వాడుకొని ప్రాన్స్ దేశంలో రాజుగా మారాడు. రాజు యొక్క కుటుంబంలో జన్మించకపోయిన గాని వీడు రాజు అయ్యాడు. ఆ విధంగా బర్నబాటు రాజు యొక్క చరిత్రలో తన పేరు కుడా నమోదు చేసుకోగలిగాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా రాజు అవ్వగలడు. ఈయన ఎవరో తెలుసా మహా గొప్ప యోధుడైన నెపోలియన్ బర్నబాట్. నా వల్ల కుదరదు అనే మాట నా డిష్నరీలో ఉండ కూడదు అనే వాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన గాని నిరీక్షణతో ప్రయత్నించి తన గురిని విజయ వంతంగా చేరుకున్నాడు. 

 

ప్రియ తమ్ముడు, చెల్లి ఈ నూతన సంవత్సరంలో నా వల్ల కాదు, ఇది సాధ్యం కాదు, ఇది జరగనే జరగదు అని ఏ కార్యం ఆలోచించ కూడదు. మనలను సృష్టించిన దేవుడు చెబుతున్నారు నేను చెయ్యలేని అసాధ్యమైన కార్యం ఏమి లేదు. అవును ఆయనకు సమస్తం సాధ్యమే. మీ కోరికలు, మీ హృదయ వాంఛలు అన్నీ ఆయన తీరుస్తారు. యేసయ్యను నమ్మి మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తే కచ్చితంగా విజయం మీ చేతుల్లోనే ఉంది. 

- శ్రీమతి. జ్యోతి ఆనంద్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet