Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.01.2022
Share:

By Village Missionary Movement

Saturday, 29-Jan-2022

దిన ధ్యానము(Telugu) 29.01.2022

 

అంశం:- ప్రథమ స్థానం ఎవరికి.

 

"సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను" - కీర్తనలు 16:8

 

చిత్రకారుడు ఒకాయన ఒక బొమ్మ గీస్తూ ఉన్నారు. దాంట్లో ఒక దేవ దూత నేలపై నాగలితో దున్నుతూ ఉండుట అలానే మరొకవైపు ఒక రైతు మోకాళ్ళు వేసి తన రెండు చేతులు పైకి ఎత్తి ఆకాశం వైపు కన్నులు ఎత్తి ప్రార్ధించుట అనేది ఆ చిత్రంలో ఉండేది. ఆ రైతు తన పొలములో పంటలు పండించుటకు మొట్టమొదటగా ప్రభువు యొద్ద తన పొలము మంచిగా పండాలి అని దేవుని యొద్ద ప్రార్ధించేవాడు. అప్పుడు ప్రభువు తన దూతను పంపి ఆ రైతుకు సహాయం చేస్తున్నారు. ఆ రైతు తన పనిలో దేవున్ని ముందు పెట్టి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపి తనకు సహాయం చేస్తున్నట్లు ఆ బొమ్మ గీయబడింది. 

 

బైబిల్లో దావీదు యొక్క జీవితాన్ని మనం చూసిన యెడల ఆయన సమస్త కార్యములలో ప్రభువుని ముందు పెట్టియుండుట అలానే ప్రభువుని స్తుతించుట మనం చూడగలం. కీర్తన 16:8 లో దేవున్ని ఎల్లపుడు నా ముందు పెట్టుకొని యున్నను అనియు, కీర్తన 34:1లో యెహోవాను నేను ఎల్లప్పుడు స్తుతించెదను ఆయన స్తుతి ఎప్పుడు నా నోట ఉండును అనియు ఇలాగే అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో దేవున్నే ముందు పెట్టి నందున దేవుడు సమస్త కార్యముల్లో దేవుడు దావీదునకు సులువు చేసి దీవించి, రాజుగా ఆయనను హెచ్చించారు. 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! మనం చేస్తున్న అన్ని పనుల్లో దేవున్ని ముందుపెట్టి ప్రార్ధించి ప్రారంభిస్తున్నామా? అనేది కొంత మనం నిదానించి చూద్దాం. మన పనుల్లో ముందుగా ఆయన కొరకు ఇవ్వవలసిన సమయాన్ని మనం ఖర్చు పెడితే అది ఎన్నడును వృధా కాదు. ఎంత సేపు అధికంగా దేవుని యొద్ద ప్రార్ధించుటలోను, బైబిల్ చదువుటలోను ధ్యానించుటలోను కేటాయిస్తున్నామో అంత అధికముగా దేవుడు మన పనులను సులువుగా చేస్తారు. దావీదు వలె మనం దేవునికి మనం ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు మనలను దేవుడు దీవించి హెచ్చిస్తారు. హల్లెలూయా! 

- బ్రదర్. పి. శివ

 

ప్రార్ధనా అంశం:-

ప్రార్ధనా గుడారపు కట్టడ పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు దేవుని నామ మహిమార్థమై ప్రతిష్ఠించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet