By Village Missionary Movement
Friday, 28-Jan-2022దిన ధ్యానము(Telugu) 28.01.2022
అంశం:- ఆయన రాకడ వరకు.
"చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు" - ప్రసంగి 9:10
మన అందరం ప్రతి రోజు సమాధి వైపే పరిగెడుతున్నాం. ఎవరు ముందు వెళ్తారు? ఎవరు తరువాత వెళ్తారు? చివరిలో వెళ్ల బోతున్నది ఎవరో దేవుడే నిర్ణయిస్తున్నారు. మనము అనేక దినములు ఈ భూలోకంలో జీవించలేం. ప్రకృతి మరియు రోగములు కలిసి మనకు మరణములను తీసుకోస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ అనే రోగం ద్వారా మరణం అలానే ప్రకృతి వలన అనేక ప్రమాదాల వలన, భూకంపాలు, వర్షాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరణాలను తీసుకు వచ్చే పట్టిక పెరుగుతూనే ఉంది.
మనము ప్రాణముతో ఉన్నంత వరకు మాత్రమే సత్క్రియలను చేయగలం. అందువలననే దేవుడు మనకు మంచి జ్ఞానమును, తెలివిని, అనేక తలాంతులు ఇచ్చి యున్నారు. వాటిని మనం సరిగా వాడుతున్నమా? లేదా సోమరితనంగా మన పనులను చేస్తున్నామా? దేవుడు మనకు ఇచ్చే జ్ఞానం ద్వారా దేవున్ని ఇష్టపెట్టే మహిమ గల కార్యములు చేయగలం అని సొలొమోను చెబుతున్నాడు. చేయుటకు నీ చేతికి అప్పగించిన ఏ పనినైనను నీ సంపూర్ణ బలముతో చేయుము అని. మనము మన ఇంట్లో ఉన్న వాళ్లకు సహాయం చేయగలం. అలానే సాధారణంగా చేసిన దానికంటే అత్యధికంగా చేయగలం.వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, అత్తమామలను మంచిగా చూసుకోగలం. పిల్లలను శ్రద్ధతో పెంచి మంచి మార్గంలో నడిపించగలం. మన చుట్టూ వున్న వాళ్ళకు ధన సహాయం లేదు ఇతర సహాయములు చేసి వాళ్ళను సంతోషపరచ గలం. ఒక క్రైస్తవుని యొక్క సాక్ష్య జీవితం తన కుటుంబంలో నుండే ప్రారంభించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. స్కూల్లో చదువుతున్న వాళ్ళు, తన తోటి విద్యార్థులకు తన వాటిని వారికి నేర్పించి వాళ్ళను ఉత్సాహ పరిచి విద్యలో పైకి రావడానికి సహాయం చేయగలం. సత్క్రియలు చేయుటలో నిరుత్సాహ పడకుండా ఉండాలి ఎందుకంటే దేవుడు మధ్యాకాశంలో దూతలతో వచ్చేటప్పుడు వారి వారి క్రియ చొప్పున వచ్చే ఫలితాన్ని తీసుకువస్తాను అని చెప్తున్నారు వచ్చే ఫలితాన్ని తీసుకువస్తాను అని చెప్తున్నారు.
అవును సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన చేతికి అప్పగింపబడిన పనిని బలము లోపములేకుండా చేస్తాం. ఒకవేళ వీటన్నింటినీ చేస్తున్నప్పుడు భూమి మీద మనకు కష్టాలు, నష్టాలు, నిరుత్సాహం మనము ఎదురు చూస్తున్న ప్రేమ మనకు దొరకకపోవచ్చు కాని నిరుత్సాహ పడిపోకుండా ఇంకను ఉత్సాహంగా పనిచేద్దాం ఆయన వచ్చేటప్పుడు జీవకిరీటాన్ని మనకొరకు ఇచ్చుటకు ఆసక్తితో ఉన్నారు. దీనిని గుర్తుంచుకొని ఇంకను మన సత్క్రియలను ఆయన వచ్చే వరకు అతి ఉత్సాహముతో చేస్తూ ముందుకు వెళ్తాం.
- శ్రీమతి. భువనా ధన బాలన్
ప్రార్ధనా అంశం:-
మన పీస్ సెంటర్ కు వస్తున్న వ్యక్తులు శరీరములోను ఆత్మ లోను విడుదలపొంది రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250