By Village Missionary Movement
Wednesday, 26-Jan-2022దిన ధ్యానము(Telugu) 26.01.2022
అంశం:- అభ్యంతర పరచకండి.
"నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు" - మత్తయి 18:6
దక్షిణ ఆఫ్రికాలో ట్రాన్స్ వాల్ అనే పట్టణంలో కదిట్రల్ దేవాలయములో ప్రసిద్ధి గాంచిన బోధకుడు ఒకాయన చేయబోతున్న ప్రసంగమును వినుటకు మన దేశ పితమహుడు గాంధీ తన స్నేహితునితో అక్కడకు వెళ్ళారు. ఆరాధన ప్రారంభం కాకమునుపే చివరి వరుసలో వెళ్ళి కూర్చున్నారు. అక్కడ ఉన్న దేవాలయంలో పని చేస్తున్న వ్యక్తి గాంధి యొద్దకు వచ్చి ఆసియా ఖండం నుండి వచ్చే వారు ఆరాధనకు వచ్చే స్థలం ఇది కాదు బ్రిటిష్ వారితో కలిసి ఆరాధించే అలవాటు ఇక్కడ లేదు. మీ కొరకు వేరే దేవాలయం ఉన్నది. కాబట్టి దయచేసి అక్కడ వెళ్లిపోండి అన్నారు. అందుకు గాంధీ తన స్నేహితునితో ఈ మందిరంలో ఆసియాఖండం యేసుక్రీస్తు ప్రభువుకు చోటు లేదు అని చెప్పుట నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వెంటనే ఆ మందిరములో పని చేసిన వ్యక్తి కోపముతో ఇది కదిట్రల్ దేవాలయము మరి ఇందులో క్రీస్తు లేరు అని ఎలా చెప్తున్నారు? అని కోపముతో అడిగాడు. అందుకు గాంధీ అవును యేసుక్రీస్తు ఆసియా ఖండమునకు చెందిన వ్యక్తియే మరి ఈ అలయములో ఆసియా ఖండపు వారికి స్థలము లేదు అని మీరే కదా చెప్పారు అని అన్నారు. ఆ పనివాడు సిగ్గుతో తల దించుకున్నాడు.
గాంధీ యేసుక్రీస్తు ను అంగీకరించి యుంటే ఎంత చక్కగా ఉండి ఉండునో. భారతదేశమునకు అది ఒక పెద్ద దీవెనగా ఉండి ఉండేది. కాని క్రైస్తవులు అనే పేరులోనే కుల పిచ్చితో జీవించిన కొందరి వలన ఆయన యేసుక్రీస్తును అంగీకరించుటకు ఆయనకు అభ్యంతరం అయ్యింది. ఈ దినం కూడా అనేకులు క్రీస్తు కొరకు పౌరుషముతో ఆయన కొరకు నిలబడుట చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. కాని అదే సమయంలో కొందరి హృదయంలో విషం వంటి కుల తలంపులు ఉన్నాయి కదా! ఎంతో మంది వ్యక్తులు దేవుని యొద్దకు రాకుండా వీళ్ళు చేస్తున్నారు. కులమునకు ఒక దేవాలయము అనే వ్యవస్థ మారే వరకు మన భారత దేశంలో ఉజ్జీవం ఆలస్యం అవుతూనే ఉంటుంది .
దీనిని చదువుతున్న స్నేహితుడా! మరి నీ గురించి ఏమిటి ?నీ హృదయంలో కూడా కులం గూర్చిన తలంపు ఏర్పడి హెచ్చు తగ్గులు ఉన్నాయా? నీ యొక్క ప్రతి కార్యం ఇతరులను దేవుని యొద్దకు నడిపిస్తుందా? లేదా దేవుని నుండి దూరం చేస్తుందా? విరిగి నలిగిన వారిని నువ్వు బాగుచేస్తున్నావా? లేదా క్రీస్తు కొరకు వస్తున్న వాళ్ళను నువ్వు తరిమి వేస్తున్నావా? ఇరతుల చదువును బట్టి, అంతస్తు, కులమును బట్టి వాళ్ళను తక్కువగా అంచనా వేసిన యెడల వాళ్ళను సృష్టించిన దేవున్ని మనము ఆశ్రద్ద చేస్తున్నాము అనేది సత్యం. మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పొలికలో చేయబడిన వారు అనే దాన్ని ఎన్నడు మర్చిపోకూడదు. మనం అందరి కొరకు చిందించ బడిన ఒకే రక్తాన్ని గుర్తుంచుకొని ఐక్యతతో, సంతోషంతో జీవిద్దాం.
- బ్రదర్. జె. సంతోష్.
ప్రార్ధన అంశం:-
దేవుడు మనకు ఇచ్చిన దర్శనము నేరవేర్చుటకు ప్రతి రాష్ట్రము నుండి 12 మంది మిషనరీలు వచ్చేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250