Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.01.2022
Share:

By Village Missionary Movement

Monday, 24-Jan-2022

దిన ధ్యానము(Telugu) 25.01.2022

 

అంశం:- మనం చేస్తున్నది న్యాయం కాదు.

 

"నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసి కొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను" - యిర్మియా 13:7

 

ఈ దినములో కూడా ప్రభువు తనకు ఇచ్చిన సామర్ధ్యాములను, కృపలను దాచిపెట్టుకొన్న కొంత మంది వ్యక్తులను మనం చూద్దాం. యిర్మీయా 13వ అధ్యాయంలో అనేక దినముల నుండి యూఫ్రటీసు నది ఒడ్డున దాచి ఉంచబడిన వస్త్రం చెడిపోయింది. దేనికి పనికి రాకుండా పోయింది అని మనం చదువుతున్నాం. మన జీవితంలో కూడా ప్రభువు మనకు ఇచ్చిన తలాంతులు, ఆత్మీయ వరములు ఒకవేళ మనం పాతిపెట్టి దాచుకొని ఉండిన యెడల ఈ సంవత్సర ప్రారంభంలో మనం దానిని తీసి ప్రభువు కొరకు వాడుటకు నిర్ణయించు కుందాం.

 

న్యాయాదిపతుల గ్రంధంలో సమ్సోను గాజాలో గల వేశ్య ఇంటికి మరియు దేలీలా ఇంటికి వెళ్ళి దేవుడు తనకు ఇచ్చిన మహోన్నతమైన బలాన్ని మరియు దేవునితో గల బంధాన్ని దాచిపెట్టి అనేక దినములు గ్రహింపు లేకుండా ఉండుట చేత చివరికి దుఃఖ పడే విధంగా చెడిపోయాడు. మనం కూడా ఇలాగు తప్పుడు స్థలములలో దేవుడు మనకు ఇచ్చిన కృపా వరములను దాచి పెట్టుకొనిన యెడల ఈ దినమే గ్రహిద్దాం. 

 

మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక తలాంతు తీసుకున్న వాడు భూమిని తవ్వి తన యజమానుడు ఇచ్చిన ధనమును పాతిపెట్టాడు. దాని వలన వచ్చిన ప్రయోజనము చీకటి మరియు ఏడ్పును పళ్ళు కొరుకుట. వాడు చీకటి ప్రాంతమునకు చెందిన వాడుగా మారిపోయాడు. మనం కూడా ఇలా ఉండిన యెడల చీకటి ప్రాంతమునకు దేవుడు మనలను త్రోసివేయబడక ముందు మేల్కొని పనిచేసి యజమానుని యొక్క సంతోషంలో ప్రవేశించుటకు సిద్ధపడుదామా?

 

ప్రియమైన వారలారా! ఏలీషా ప్రవక్త దినాల్లో జీవించిన నలుగురు కుష్టు రోగులు చేసిన సత్ క్రియల నుండి మనం ఇక పాఠాన్ని నేర్చుకోగలం. కరువు అల్లకల్లోలం చేస్తున్న ఆ దినాల్లో వారు సిరియన్లు ఉన్న దండు పాళెం లోనికి వెళ్లి ఆ నిధులను, తమ కొరకు దాచిపెట్టు కొనుట ప్రారంభించిన సమయంలో మనం చేస్తున్నది న్యాయం కాదు అని గ్రహించి తాము తెలుసుకున్న సువార్తను రాజు యొక్క భవనం వరకు ప్రకటించాడు. అందువలన ఇశ్రాయేలీయులు సంతోషించారు. మనం చేస్తున్నది న్యాయం కాదు అని మనం ఎప్పుడు గ్రహింపు చెందబోతున్నాం. 

- బ్రదర్. బెంజిమిన్.

 

ప్రార్ధనా అంశం:-

సేవకులు కొరకు వేస్తున్న మ్యాగజైన్ కి పోస్టల్ పర్మిట్ దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al