Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.01.2022
Share:

By Village Missionary Movement

Monday, 24-Jan-2022

దిన ధ్యానము(Telugu) 24.01.2022

 

అంశం:- దేవుని చిత్తము చేయుడి.

 

"ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట... దేవుని చిత్తము" - 1 థెస్సలొనికయులకు 5:18

 

తల్లులు పిల్లలకు ఇచ్చే ఆహారం మంచి బలము కలిగిన ఆహరం ఇస్తుంటారు. వాటిలో కొన్ని సార్లు రుచిగా ఉండదు. ఒక బాలుడు ఒక రోజు తన తల్లితో రుచి లేని ఈ ఆహారం నాకు ఇచ్చి ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని చెబుతున్నావు అని అన్నాడంట. అలాగే మనకు ఇష్టం లేని కార్యములు దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని మనోభావము ఉంటూ ఉంటుంది.

 

కాని పౌలు సీలను చూడండి చెరసాలలో కాళ్ళు బందించ బడినప్పటికి దేవున్ని స్తుతించి పాడారు. కారణం దేవుడు వాళ్ళను ఎలాంటి వాళ్ళగా ఉంచాలి అనుకున్నారో అలాంటి వాళ్ళగా ఉన్నారు. చెరసాల తలుపులైన బందించే సంకెళ్ళు అయిన వాళ్ళ యొక్క సంతోషంతో నిండిన స్తుతి పాటలను అపి వేయలేకపోయింది. అది మాత్రమే కాదు అపోస్తులలు దేవునికి చేస్తున్న సేవ ద్వారా వస్తున్నా కష్టాలు ఇరుకులు అన్నింటినీ తలంచి సంతోషించారు. అనగా అన్ని పరిస్థితుల్లో కూడా దేవున్ని నమ్మి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిగా ఉన్నారు. 

 

నైటింగేల్ అనే పక్షి రాత్రి సమయంలో పాడుతూ ఉంటుంది. చీకటి దాని యొక్క ఇంపైన పాటను ఆపలేక పోయింది. కారణం అది ఎప్పుడు పాడాలి అని దేవుడు దాన్ని సృష్టించారో ఆ ఉద్దేశ్యంతోనే ఆ పక్షి దానిని నెరవేరుస్తుంది. దేవునితో నడిచిన వాళ్ళు దేవుడు దేనిని చెయ్యమని చెబుతున్నారో దానిని చేయుట వలన ఆయన సంతోషిస్తున్నారు. అటువంటి వారు పరిస్థితులు చూసి నిరుత్సాహ పడిపోరు. ఆయన పిల్లలుగా మనము సమస్త కార్యములలో స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. చెయ్యలేని కార్యాన్ని చెయ్యాలి అని దేవుడు ఎన్నడు ఎదురు చూడరు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో సమస్త కార్యములకు స్తుతులు చెల్లించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. రోగము, దుఃఖము, చింతలు, శోధనలు, ఇరుకైన పరిస్థితులు అని ఎలాంటి సమస్యలు మన చుట్టు ముట్టిన ఆయన పిల్లలమైన మనము ఆయన సమస్త కార్యములు కొరకు స్తుతులు చెల్లించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే వీరు సమస్త కార్యములు భరించుటకు, సహించుటకు, తప్పించుకొనుటకు ఆయన బలము ఇస్తున్నారు. 

- శ్రీమతి. గీతా రిచర్డ్.

 

ప్రార్ధనా అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న వైద్య సేవలో ఈ సంవత్సరం నూతనంగా ప్రారంభించబడిన ఈ. పరిచర్యలో సమర్పించ బడిన సేవకులు మనకు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet