Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.01.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 22-Jan-2022

దిన ధ్యానము(Telugu) 23.01.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

అంశం:- జ్ఞానమే ప్రాముఖ్యం.

 

"జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు" - సామెతలు 3:13

 

హాలో పిల్లలు హౌ అర్ యు. మీరు ప్రతి వారం కద వింటున్నారు కదా!. మరి ఈ రోజు బైబిల్లో జరిగిన నిజ సంఘటన ఒకటీ చెప్పబోతున్నాను వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ ? ఓ ఎస్ అని చెప్పండి చూస్తాను. సూపర్ చెప్పారు కదా! 

 

సొలొమోను అని ఒక రాజు ఉన్నారు ఆయన యొక్క తండ్రి దావీదు రాజు. దేవునికి ఇష్టమైన వారిగా జీవించి ప్రజలకు మేలు చేసి చక్కగా పరిపాలన చేశారు. ఆయన వలె ఆయన కుమారుడైన సొలొమోను రాజు కూడా దేవున్ని ప్రేమించే వ్యక్తిగా ఉండేవారు. ఒక రోజు రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు కలలో ప్రభువు ప్రత్యక్షమైయ్యారు. మీకు కూడా కలలు వస్తాయి కదా? అవును అలానే ఈయనకు వచ్చిన కలలో ప్రభువు వచ్చి నీకు ఏమి కావాలో అడుగుము నేను నీకు ఇస్తాను అన్నారు. మీరు అయితే ఏమి అడుగుతారు ఆలోచించి చెప్పండి. 

 

సొలొమోను రాజు కూడా ఆలోచించారు. డబ్బు, ప్రఖ్యాతి, ఆస్తి ఇవి అడిగి ఉంటాడు అనుకుంటున్నారా? కానే కాదు. మరి ఏమి ఆడిగాడో చెప్తాను వినండి. నేను ఒక మంచి రాజుగా ఉండుటకు ప్రజలను పరిపాలించుటకు మంచి జ్ఞానం కావాలి అని అడిగాడు. ఇవి దేవుని దృష్టిలో మంచివిగా ఉన్నాయి. ఇందువలన ఆయన అడిగిన జ్ఞానమును మరియు అడగని ఘనతను కూడా ఆయనకు ఇచ్చారు. ఈయన జ్ఞానము గురించి విని లోకంలో గల రాజులు, రాణులు సొలొమోనును వెతుక్కోని వచ్చారు. ఈయన నీతిగా తీర్పు తీర్చినా దానిని విని ప్రజలు ఆశ్చర్య పోయారు. ఈయన పేరు, ప్రఖ్యాతి ,ఘనత అన్నీ చోట్లా కూడా మాట్లాడే కార్యముగా మారింది. సొలొమోను ఒక పెద్ద జ్ఞాని మాత్రమే కాదు ఆయన గొప్ప ధనవంతుని గాను ప్రఖ్యాతి గాంచిన రాజు గాను దేవునికి భయభక్తులు కలిగిన రాజుగాను ఉన్నారు.

 

ప్రియమైన బంగారు పిల్లలారా! సొలొమోను రాజుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు మీకు కూడా జ్ఞానం ఇవ్వగలరు. మీరు అడిగిన యెడల అందరికి సంపూర్ణంగా దయచేస్తున్న యేసుక్రీస్తు మీకు కూడా సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలరు. ఈ నూతన సంవత్సరంలో జ్ఞానాన్ని పొందుకొని విజయ వంతంగా జీవించుటకు మిమ్మల్ని ప్రోత్సాహిస్తున్నాం. హ్యాపీ న్యూఇర్.

- బ్రదర్. విజయ్ కుమార్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet