Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.01.2022
Share:

By Village Missionary Movement

Friday, 21-Jan-2022

దిన ధ్యానము(Telugu) 22.01.2022

 

అంశం:- యవ్వనస్తుల యొక్క పౌరుషము.

 

"అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను" – యోవేలు 2:18

 

ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఒక దూడను చేసి దానికి నమస్కరిస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని పతనం చేశారు. మన జీవుతంలో ఈ కాలంలో అందరూ కూడా ప్రతిమకు నమస్కారం చెయ్యాలి అంటే మనం ఏం చేస్తాం? దేవుని కొరకు పౌరుషముతో నిలబడదామా? లేదా లోకానికి భయపడి మనం మారిపోతామా? ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని కొరకు పౌరుషముతో నిలబడిన దేవుని దాసుల గురించి ఈ దినము ధ్యానిద్దాం. 

 

నెబుకద్నేజరు అనే బబులోను రాజు 60 మూరలు ఎత్తు మరియు 6 మూరలు వెడల్పు గల ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టి ఆ ప్రతిమను ఆ దేశములో గల అందరూ వచ్చి దానికి నమస్కరించాలి అని ఆజ్ఞా పించారు. అందరూ రాజు యొక్క ఆజ్ఞకు లోబడి భయపడి నమస్కరిస్తున్నారు. కారణం సాష్టాంగ పడి నమస్కరించని యెడల మండుతున్న అగ్ని గుండంలో పడవేయ బడతారు అని చెప్పారు. ఆ దేశంలో షద్రక్, మిషాక్, అబేద్నెగో అనే ముగ్గురు యవ్వనస్తులు ఉన్నారు. ఆ ముగ్గురు యవ్వనస్తులు కూడా పౌరుషము గల వారిగా ఉన్నారు. 

 

రాజు గారి ఆజ్ఞ కు వారు లోబడలేదు. వారు ఆ ప్రతిమకు నమస్కరించ లేదు అని నేరం మోపబడి రాజు ఎదుట నిలబడి ఉన్నారు. అప్పడు రాజు వారిని చూసి ప్రతిమకు నమస్కరించమని చెప్పారు. వారైతే ధైర్యంగా రాజు వైపు చూసి నెబుకద్నేజరు ఈ కార్యం గురించి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆరాధిస్తున్నా దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండంలో నుండి మరియు రాజైన మీ చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించగలరు. ఒకవేళ విడిపించక పోయిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరించము అని దృఢంగా చెప్పారు. అందుకు రాజు కోపోద్రేకుడై మండుచున్న అగ్ని గుండమును 7 రెట్లు వేడిని పెంచి వీళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టి అందులో పడేయమని చెప్పారు. వాళ్ళ యొక్క పౌరుషాన్ని చూసిన దేవుడు అగ్ని గుండంలో నాల్గవ వ్యక్తిగా తిరుగు చున్నారు. దానిని చూసిన రాజు భయపడి మహోన్నతమైన దేవుని దాసులారా అని వాళ్ళను పేరు పెట్టి పిలిచి బయటకు రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళ యొక్క తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. అగ్ని వాసన కూడా వారి యొద్ద రాలేదు. దేవుడు వాళ్ళను విడిపించారు. 

 

ఇలాగు రక్షింపదగిన రక్షకుడైన దేవుడు వేరొకరు లేరు. అప్పుడు ఈ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు నాశనం చెయ్యబడతారు అని రాజు ఆజ్ఞపించారు. ఈ ముగ్గురు యవ్వనస్తుల చేత బబులోను దేశంలో దేవుని నామం హెచ్చింపబడింది. అలాగే వారు కూడా హెచ్చింప బడ్డారు. మనము దేవుని కొరకు పౌరుషముతో నిలబడినప్పుడు మనము మన భారత దేశాన్ని ఆయన కొరకు సొంతం చేసుకుంటాం. హల్లెలూయా!

- సెలెక్టెడ్

 

ప్రార్ధనా అంశం:

తమిళనాడులో చర్చీలు లేని గ్రామాల్లో దేవుని కొరకు చర్చీలు కట్టబడేటట్లు చేస్తున్న ప్రయాసలో దేవుని హస్తం తోడై ఉండులాగునా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet