By Village Missionary Movement
Thursday, 20-Jan-2022దిన ధ్యానము(Telugu) 20.01.2022
అంశం:- ఎక్కువగా తలంచవద్దు.
"తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక... స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను" - రోమీయులకు 12:3
బాక్సింగ్ ఆటలో ప్రఖ్యాత గాంచిన యోధుడుగా ఉన్న వ్యక్తి మొహమ్మద్ అలీ. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 61 పోటీలలో పాల్గొని 57 సార్లు గెలిచి ఘనత పొందుకున్న వ్యక్తి. ఆయన తన గురించి ఐయమ్ ద గ్రేట్ అని గర్వాంగా చెప్పు కొనేవాడు. ఒక మారు ఆయన విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేయకుండా కూర్చున్నాడు.అందరిని చూసి సిట్ బెల్ట్ పెట్టుకొమని ఆ విమానంలో పనిచేస్తున్న స్త్రీ చెబుతున్నారు. తరువాత ఈయన యొద్దకు వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు. నేను సూపర్ మ్యాన్ నాకు సిటు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని గర్వంగా చెప్పుకున్నారు. అందుకు ఆ స్త్రీ సూపర్ మ్యాన్ కి విమానం కూడా అవసరం లేదు అని అన్నారు. వెంటనే ఏమి జవాబు చెప్పకుండా అలీ సిట్ బెల్ట్ పెట్టుకున్నారు. దానిలో తన జీవితంలో మితిమీరిన గర్వం కనబడింది.
బైబిల్లో రాజైన నెబుకద్నెజరు ఇది నా బలము చేత, నా పరాక్రము చేత నా ఘనత, మహిమను వ్యక్త పరుచుటకు నేను కట్టిన మహా బబులోను కదా అని గర్వంతో చెప్పాడు. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకిస్తున్నారు అనే వాక్యం ప్రకారం దేవుని కోపం వెంటనే ప్రత్యక్షమై సింహాసనము నుండి త్రోసివేయబడడమే కాక మనుష్యుల యొద్దనుండి తరిమివేయబడి పశువు వలె గడ్డిని మేస్తు, పశువు వలె జీవించడానికి గల కారణము ఏమిటి అంటే ఆయన యొక్క గర్వమే. తనకు తెలివి వచ్చి తన పరిస్థితి గ్రహించి తనను తగ్గించుకొని దేవుని వైపు చూసి విజ్ఞపన చేసాడో అప్పుడు కోల్పోయిన వాటిని మరల పొందుకున్నాడు.
మన జీవితంలో కూడా మనం చేస్తున్న పాపములలో చాలా బలమైనది గర్వమే. మన ఆలోచనలో గర్వం నివసిస్తున్నప్పుడు దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడుటకు వస్తున్నారు. అనేకులు నేను తప్ప ఈ పనిని చేయుటకు ఎవరికి అర్హత లేదు అని తన గురించి గర్వంగా ఆలోచిస్తుంటారు. ఇంకా కొందరైతే నేను ఏమి చెయ్యలేను అని దేవుడు నాకు ఎలాంటి తలాంతులు ఇవ్వలేదు అని ముడుచుకొని కూర్చుంటారు. పైన చెప్పబడిన ఈ రెండు కూడా తప్పే. మన ప్రతి ఒక్కరం దేవుని కొరకు ఎదైనా చెయ్యాలి. కాబట్టి గర్వం మన జీవుతంలో రానివ్వకుండా జాగ్రత్త పడి మన ద్వారా దేవునికి మహిమ తీసుకు వచ్చే పాత్రలగా మారుటకు దేవుడు మనకు కృప దయ చేయును గాక!.
- బ్రదర్. హానిస్ శామ్యూల్
ప్రార్ధన అంశం:-
బైబిల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఉండుటకు కట్టబడుతున్న గదులు త్వరగా కట్ట బడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250