Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.01.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 19-Jan-2022

దిన ధ్యానము(Telugu) 19.01.2022

 

అంశం:- ఉన్నత సంరక్షణ.

 

"నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా" - మత్తయి 15:18

 

రాజు ఒక కంప్యూటర్ షాప్ లో పనిచేస్తున్నాడు. ఒక రోజు ఆ షాప్ కి పల్లెటూరి నుండి రామస్వామి అనే వ్యక్తి కంప్యూటర్ కొనుటకు వచ్చాడు. వచ్చిన అతను నా కుమారుడు పట్టణంలో పెద్ద సరుకుల షాప్ పెట్టుకున్నాడు కాబట్టి దానికి మంచి కంప్యూటర్ కావాలి అని అడిగాడు. రాజు ఇది కొత్త మోడల్ దీని ఖరీదు ఎక్కువ అని చెప్పి మరియొకటి చూపించి ఇది పాత మోడల్ దీని ఖరీదు తక్కువ అని చెప్పాడు. రామస్వామి దానిని చూసి కోపముతో బ్యాంకులలో వాడుతున్న దానిని నా కుమారుడి యొక్క సరుకుల షాప్ కి ఇస్తున్నవే అని కోప పడ్డాడు. సరుకుల షాప్ కి అవసరమైన కంప్యూటరే నాకు కావాలి అని అన్నాడు. రాజు నవ్వుతూ అయ్యా కంప్యూటర్లు అన్ని ఒక్కటే కానీ దాంట్లో ఏ విషయాలను సేకరించి పెడుతున్నామో అదే బయటకు వస్తుంది. కాబట్టి దింట్లో మీ షాప్ కి కావాల్సిన విషయాలు సేకరించు కొంటె అది మీకు ప్రయోజనకరంగా మారిపోతుంది అన్నాడు. అవును మన జీవితంలో కూడా అంతే మనం దేని గురించి అకోచించి మన మనస్సు లోనికి ఎక్కించు కొంటున్నామో అదే క్రియ రూపము దాల్చి బయటకు వస్తుంది

 

మనుష్యుల హృదయం లోపాల నుండి వస్తున్న ఆలోచనలు మరియు తలంపులే మనిషిని ఘనహీన పరుస్తుంది అని ప్రభువు చెబుతున్నారు. కోపము, మురకత్వం, ద్వేషం, దొంగతనం, ఆబద్ధం ఇవన్నీ ఒక మనుష్యుని పాడుచేతుంది అని యేసు క్రీస్తు చెబుతున్నారు. ఆత్మ ఫలములు అయిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సద్గుణం, విశ్వాసం ఇవన్నీ మనలో విస్తరిస్తున్న కొలది శరీరానుసారమైన కార్యములైన కోపము, ద్వేషం, అసూయ ఇవ్వన్నీ మన నుండి దూరం అయిపోతాయి. మనము ఆత్మీయ ఫలములు పొందుకొనుటలో ఎక్కువ ప్రయాసపడాలి. అందుకు అద్దం ముందు మన మొకము చూస్తున్నట్లు మన హృదయమును చూపించ గలిగిన బైబిల్ యొక్క వాక్యాన్ని చదివి మనలను మనము అనుదినము సరిచేసుకొనే వారిగా ఉండాలి. 

 

అవును స్నేహితులరా! క్రైస్తవ జీవితమునకు హృదయం వంటిది ప్రార్ధనా మరియు బైబిల్ ధ్యానం కాబట్టి దీనిని మరచిపోకండి. కంప్యూటర్ లో మీరు ఎలాంటి విషయాన్ని సేకరించి ఉంచుతారో అవే బయటకు వస్తాయి. అలాగే మన ప్రతి ఒక్కరి హృదయంలో బైబిల్ వాక్యం, మరియు ప్రార్థనలతో నింపబడినప్పుడు ఆత్మ ఫలము మరియు పరిశుద్ధత బయటపడుతుంది. ఇది మొదలు మన హృదయాన్ని బైబిల్ ధ్యానముతో మరియు ప్రార్థనతో కాచుకొనుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక! ఆమెన్.

- శ్రీమతి. మనుశుయా పౌల్

 

ప్రార్ధన అంశం:-

బైబిల్ కాలేజీలో మరియు సేవకులకు వంట చేయుటకు వుడ్ స్టీమర్ బోయిలెర్ కోన వలసి ఉంది కాబట్టి దానికి తగిన ధన సహాయం అందేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet