Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.01.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 18-Jan-2022

దిన ధ్యానము(Telugu) 18.01.2022

 

అంశం:- దేవుని చేత ఘనత పొందుట.

 

"మీరు చేసిన కార్యమును.... తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు" - హెబ్రీయులకు 6: 10

 

లోకము చేత ఘనత పొందుకున్న వాళ్ళ పట్టికలో రాజకీయ నాయకులు, సినిమా తారలు వంటి వారే చోటు దక్కించుకుంటారు. సాధారణ పని చేస్తున్న వారి పేర్లకు ఆ పట్టికలో చోటు దక్కనే దక్కదు. కాని సాధారణ పని చేస్తున్న వారు కూడా దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు రాజాదిరాజైన దేవుని చేత ఘనత పొందుకుంటారు. పైన చదవబడిన లేఖనబాగంలో వచ్చే నయమాను సిరియా రాజు యొక్క సైన్యాధిపతి కాని ఆయన జీవితాన్నే పతనం చేయగలిగిన కుష్టు రోగము ఆయనకు ఉండేది. ఆయన కుష్టు రోగము నుండి స్వస్థత పొందుకొనుటకు గల కారణముగా ఉండినది ఇశ్రాయేలు దేశమునుండి చెర పట్టి తీసుకురాబడిన ఆయన యొక్క భార్యకు పనిమనిషిగా ఉండిన చిన్నది. 

 

ఎలీషా ప్రవక్త ఆయనను యోర్దాను నదిలో 7 మారులు మునగమని సలహా చెప్పినప్పుడు నయమాను ఉగ్రత గలవాడుగా మారాడు. అప్పుడు ఆయన పనివాడు ఎలీషా ఆజ్ఞకు లోబడమని బ్రతిమాలుకొన్నారు. ఆయన వాళ్ళ మాటకు చెవియొగ్గి యోర్దానులో 7మారులు మునిగినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. ఇశ్రాయేలు రాజుగాని ఎలీషా ప్రవక్త గాని ఈ గొప్ప కార్యాన్ని చేయలేదు. సులువైన సలహా చెప్పిన చిన్నది మరియు ఆ పనివాళ్ళే ఈ గొప్ప కార్యం మొత్తం జరగడానికి కారకులయ్యారు. సాధారణ పని చేసుకునే వాళ్ళే దేవుని కొరకు పని చేయుట వలన పొందుకున్నది ఏమిటి? ఇదిగో ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంటున్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లోకములో లేడు అని గ్రహించి యున్నాను అని నాయమాను సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. 

 

దేవుని చేత వేరుపరచబడిన ప్రజలారా! మీరు కూడా ఒకవేళ లోకము దృష్టిలో ఒక సాధారణమైన పని చేస్తున్న వారిగా ధనము, ఆస్థి, పలుకుబడి అనే వాటిలో పలుకుబడి అనే వాటిలో ఘనత లేని వారుగా ఉండవచ్చు. చదువు తెలివి సామర్ధ్యం ఇవేవీ లేకుండా కూడా ఉండవచ్చు. కలత చెందకండి మిమ్ములను దేవుడు పెట్టిన స్థలములలో దేవుణ్ణి మహిమ పరుస్తూ ఉండండి. ఆయనను కొనియాడుతూ ఉండండి మీ యొక్క పనిస్థలాలలో పని చేస్తున్న అందరి మేలుకొఱకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. వారు దేవుణ్ణి తెలుసుకునేటట్లు ప్రయాస పడండి. ఇలా చేసినయెడల పరలోకపు దృష్టి మిమ్మల్ని హీరో గా చూస్తుంది. మీ ద్వారా పరలోకము సంతోషపడుతుంది. ఆమెన్. 

- శ్రీమతి గీతా రిచర్డ్

 

ప్రార్థన అంశం:- 

బైబిల్ కాలేజీ లో చదువుతూ వస్తున్న విద్యార్థులు దేవుని హస్తములో చివరికాలపు ఉజ్జీవపు ఆయుధాలుగా వాడబడేటట్లు ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet