Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.01.2022
Share:

By Village Missionary Movement

Sunday, 16-Jan-2022

దిన ధ్యానము(Telugu) 17.01.2022

 

అంశం:- బలాఢ్యునికి దేవుడు.

 

"...ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే" - న్యాయాధిపతులు 6:14

 

ప్రఖ్యాతి గాంచిన ఉజ్జివ ప్రసంగి డి.ఎల్. మోడీ వారియొక్క జీవితంలో జరిగిన నిజ సంఘటన ఇది. తన శరీర బలహీనత వలన ఆయన ఒక వైద్యుడ్ని కలుసుకున్నారు. ఆయన నీకు హృదయంలో సమస్య ఉంది కాబట్టి నీకు విశ్రాంతి అవసరము అని చెప్పారు. మోడీ గారి మనస్సు కూడా ఆ పరిస్థితుల్లో విశ్రాంతి కోరుకుంది. అటువంటి పరిస్థితుల్లో అమెరికా దేశములో జరుగుతున్న 5 నెలల కూడికలు కొరకు ఓడలో ప్రయాణం చేస్తున్నారు మోడీ. ఓడ ప్రయాణానికి తన శరీరం సహకరించ నందున తన గదిలోనే ఉండిపోయారు. జరగబోతున్న ఉజ్జివ కూడికలో తన పనిని ఎవరెవరికి అప్పగించాలి అని ప్రణాళిక వేస్తున్నారు. సముద్రము తుఫాను కారణంగా అల్లకల్లోలము వలన ఓడ యొక్క ఆధార స్తంభం రెండు ముక్కలుగా విరిగిపోయింది. సముద్రంలో గల నీళ్లు అన్ని ఓడలోనికి రావడం ప్రారంభించాయి. దైవజనుడైన మోడీ దేవుని వైపు చూసి ప్రార్ధించారు. అందుకు జవాబుగా దేవుడు నీకు విశ్రాంతి అవరము అని నీకు నీవుగా నిర్ణయించు కున్నావు నీ యొక్క సంపూర్ణ బలముతో పని చేయకపోతే ఏ ప్రయోజనము లేదు కాబట్టి నేను నిన్ను నా యొద్దకు పిలుచుకొంటాను అని చెప్పిన మాటలు ఆయన గుండెను కదల్చివేశాయి. వెంటనే మోకాళ్ళు వేసి ఈ ప్రమాదంలో నుండి తనను విడిపిస్తే సంపూర్ణ బలముతో తన పరిచర్య చేస్తాను అని నిర్ణయించుకున్నారు. దాని తరువాత తన బలహీనత గురించి జీవితంలో ఎన్నడు గుర్తు చేసుకోలేదు. వాళ్ళను కాపాడుటకు మరియొక నావ రావడం వలన అందరూ క్షేమంగా ఒడ్డునకు చేరుకొన్నారు. వెంటనే మోడీ గారు దేవుని కృతజ్ఞతలు తెలిపి సంతోషించారు. దాని తరువాత అతనికి పౌరుషము పొంగిపొర్లింది. 

 

బైబిల్లో కూడా దేవుడు వాడుకున్న అనేక పాత్రలు గమనించి చూచిన యెడల తమ కార్యములలో పూర్ణ మనస్సుతో పని చేసిన వాళ్లనే దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నారు. వర్షం చూడని కాలంలో గొప్ప ఓడను తయారు చేయుటకు దేవుడు నోవహును ఏర్పచుకొన్నారు. మిద్యానీయుల చేతుల్లోనుండి గోధుమలను తప్పించుటకు దుల్లగొడుతున్న గిద్యోనును దేవుడు వాడుకున్నారు. 12 జతల ఎద్దులు గల నాగలిని దున్నుతున్న ఎలిశాను రెండతలు వరాలు ఇచ్చి దేవుడు వాడుకున్నారు. గొర్రెలు కాస్తున్న దావీదును తమ గొర్రెలను సింహము నుండి ఎలుగుబంటి నుండి తప్పించుటకు దావీదును వాడుకున్నారు. ఇలా దేవుని పని కొరకు సంపూర్ణ బలముతో మీరు కూడా పని చెయ్యడానికి సిద్ధమేనా? ఒక వేళ బలహీనత వలన నిరుత్సాహ పడిపోయి ఉన్నారా? ఆవసరతలు బట్టి నిరుత్సాహంతో ఉన్నారా? ఈ రోజే పౌరుషముతో లేచి దేవుని కొరకు కార్యములు మొదలు పెట్టండి. మీ కొరకు తన మహిమ గల బలాన్ని మీ కిచ్చి మిమ్మల్ని వాడుకొనుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా!

- సహోదరి. ఆర్. మంజులా

 

ప్రార్ధన అంశం:-

ఉత్తర భారత రాష్ట్రల్లో నూతన పరిచర్య ప్రారంభించడాని దేవుడు సహాయం చెయ్యాలి అని ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet