Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.01.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 16-Jan-2022

దిన ధ్యానము(Telugu) 16.01.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం:-

 

అంశం:- నో ఫ్రీ

 

"నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు" - సామెతలు 28: 20

 

ఐరోపా నుండి న్యూయార్క్ వైపు ప్రయాణం అవుతుంది ఆ ఓడ. దాంట్లో 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రైన్ మరియు విమానం లో ఎలాగూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని ఉంటుందో అలాగే ఆ ఓడలో కూడా ఉంది. సాధారణమైన కుటుంబం ఒకటి ప్రయాణం చేస్తుంది. అమ్మ, నాన్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి బాబుకు 10 సంవత్సరాలు మరియు వాడు కొద్దిగా తెలివైన వాడు. మొట్ట మొదటి సారిగా ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. పిల్లలు మరి మీరు ఎప్పుడైనా ఓడలో ప్రయాణం చేసారా? ప్రయాణం చాలా బాగుంటుంది కదా? ఆ ఓడలో హోటల్, ప్లే గ్రౌండ్ ఉన్నాయి. అందులోకి ఎవరైనా వెళ్ళవచ్చు కానీ అక్కడ వస్తువులు డబ్బులు పెట్టి కొనాలి. వీడైతే డబ్బులు పెట్టి కొనలేడు కాబట్టి చుట్టూ తిరిగి చూసి మరల వచ్చేసేవాడు. 

 

ఒక దినము ఆ హోటల్లో ఉన్న కేకు ఒకటి కొనాలని ఆశించాడు. ఆ కేకు యొక్క ధర నాలుగు డాలర్లు. వెంటనే నాన్న దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగాడు. నాన్న దగ్గర ఉన్న డబ్బులు అన్ని లెక్కపెట్టి చూస్తే మూడున్నర డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఆ కేకు కొనుటకు డబ్బులు సరిపోవు. కాబట్టి రోజు వచ్చి ఆ కేకు చూసి వెళ్ళేవాడు. వీటన్నింటినీ గమనిస్తున్న ఒకాయన ఆ కేకును కొని అతనికి ఇచ్చాడు. కానీ ఆ బాబు దానిని తీసుకోనుటకు నిరాకరించాడు. నేను డబ్బులు ఇస్తేనే తీసుకొంటాను అన్నాడు. ఆ మాట విన్న ఆయన చాలా ఆశ్చర్య పడ్డాడు. మనకి ఎవరైనా కేకు ఇస్తే తీసుకొని తినేస్తాము కదా. తెలియని వ్యక్తులు ఏమి ఇచ్చిన తీసుకోకూడదు సరేనా పిల్లలు. వీటిని చుస్తున్న ఆ వ్యక్తి చెప్పారు బాబు నువ్వు రోజు వచ్చి కేకును చూసి వెళ్లిపోవుట నేను గమనించాను. అది నాకు చాలా బాధ అనిపించింది. నేనే ఈ హోటల్ కు యజమాని కాబట్టి ఈ కేకు తీసుకొని తిను అన్నాడు. ఆ కేకు కొనకుండా నాకు ఏదైనా పని ఇవ్వండి సార్ ఏపని అయిన పరవాలేదు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రెండు గంటలు పనిచేసి 10 డాలర్లు జీతం తీసుకున్నాడు. తాను చూసిన దాని కంటే రెండంతలు పెద్ద కేకు కొనుక్కొని తన గదికి తీసుకువెళ్లాడు. దానిని చూసిన ఆ యజమానుడు చెప్పాడు కచ్చితంగా ఈ బాబు వాడి జీవుతంలో గొప్ప వ్యక్తి అవుతాడు. నిజంగా తన జీవితంలో ప్రయాస పడేవారిని హెచ్చింపు వెతుక్కుంటూ వస్తుంది అన్నారు. 

 

పిల్లలు మరి మనం అనుకున్నవి ఉచితంగా దొరికితే వెంటనే తీసుకుంటాం కదా? కానీ ఆ చిన్న బాబు కష్టపడి పనిచేసి తీసుకున్నాడు. అబద్ధం చెప్పి మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా తీసుకొనే పనులు మీరు ఎన్నడు చెయ్య కూడదు. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుటకు కాపీ కొట్ట కూడదు. కష్టపడి ప్రయాసపడి ఎలాంటి పనినైనా యాదార్థతతో, నిజాయితీతో చేసినప్పుడు హెచ్చింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటట్లు దేవుడు సహాయం చేస్తారు. ఈ సత్యం అనే నిచ్చనే హెచ్చింపునకు తీసుకు వెళ్లే ఒక నిరీక్షణ. సరే మీరు కూడా అలా చేస్తారా? సరే.

- శ్రీమతి. జ్యొతి ఆనంద్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet