Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.01.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Jan-2022

దిన ధ్యానము(Telugu) 13.01.2022

 

అంశం:- ఖరీదైన స్వాస్థ్యము.

 

"వాటిని(లేఖనములను) పరిశోధించుచున్నారు" - యోహాను 5:39

 

తన కొరకు ఒక బైబిల్ కొనుక్కోవాలి అని మేరీ జోన్స్ పడిన శ్రమలు ఇంత అంత కాదు. డబ్బులు ఇచ్చిన బైబిల్ కొనలేని కాలము అది. దేవుని కృప చేత చదువుట, వ్రాయుట నేర్చు కున్నది ఆ చిన్నది. రోజుకు 6 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి బైబిల్ చదువుకున్నది. తన కొరకు ఒక బైబిల్ కొనుక్కోవాలి అని చాలా ఆశగా ఉండేది. బైబిల్ కొనుటకు 6 సంవత్సరాలు కఠినంగా పని చేసి పొదుపు చేసిన గాని 80 కిలోమీటర్లు ఒట్టి కాళ్ళతో నడుచుకొని వెళ్లి బైబిల్ కొనాల్సి వచ్చింది. బైబిల్ కొనుక్కున్న ఆమె దానిని చదివి ఇతరులకు మాదిరి కరంగా జీవించింది. ఆమె యొక్క మాదిరి కరమైన జీవితం చూచుట వలన మరియు ఆమె ఇచ్చిన సలహాలు వలన అనేకులు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. బైబిల్ చదవని ఏ ఒక్కరు కూడా ప్రయోజనమైన క్రైస్తవునిగా జీవించుట చూడలేదు. తన బైబిల్ని పక్కన పెట్టి ప్రార్ధించిన దేవుని పనిలో ఆయన ఎంత మాత్రం ప్రయోజనంగా ఉండలేరు అని డీ.ఎల్. మోడీ ప్రసంగంలో చెప్పారు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానం అయిన యేసుక్రీస్తుతో పాటుగా బైబిల్ని కూడా మనకు ఇచ్చారు అని అబ్రాహాము లింకన్ చెప్పారు. దేవుని యొక్క వాక్యం గురించి కీర్తనలు 19:7 లో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును అని వ్రాయబడి ఉంది. 

 

ఒకడు లోకాన్ని ప్రేమించి బైబిల్ని ప్రేమించ లేడు. లోకంలో అనేక పుస్తకాలు తెలివిని ఇవ్వగలవు కానీ బైబిల్ మాత్రమే యేసుని ప్రేమను మరియు రక్షణను ఇచ్చి పరలోకాన్ని చేర్పించ గలదు. అది కాగితములతో చేయబడినది కాదు. అది పరిశుద్దమైన దేవుని యొక్క జీవపు నాడి. 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! మన చేతుల్లో ఉంటున్న బైబిల్ ఖరీదైన స్వాస్థ్యము. అనేక మిషనరీల యొక్క త్యాగములతో మన మాతృ భాషలో మనకు అందించారు. కాబట్టి బైబిల్ ధ్యానించి జీవించుటకు మిమ్మల్ని మీరు సమర్పించు కొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

- బ్రదర్. పి. శివ

 

ప్రార్ధన అంశం:-

మీడియా పరిచర్యలో పని చేస్తున్న సేవకులను దేవుడు విశేష ఆత్మతో నింపి నడిపించేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet