By Village Missionary Movement
Monday, 10-Jan-2022దిన ధ్యానము(Telugu) 10.01.2022
అంశం:- కాళీగా ఉండకండి.
"పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను" - యోహాను 9:4
చెన్నై, ఢిల్లీ, ముంబై అనే పెద్ద నగరాల్లో మేన్ పవర్ ఏజెన్సీ(Manpower agency) నడిపించే వారు ఎక్కువ అయిపోయారు. వీళ్ళ పని ఏంటి అంటే ఆయా కంపెనీలకు మరియు సంస్థలకు పని చెయ్యడానికి వ్యక్తులు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకు వ్యక్తులను పంపించడమే. ఎవరు కాళీగా ఉండరు చదువు లేనివారు, చదివిన వారు అన్ని రకములైన ప్రజలు వీళ్ళ దగ్గర ఉంటారు. ఎవరు అడిగిన వెంటనే పంపిస్తారు. దీని ద్వారా ఆయా కంపెనీలకు పనులు సరైన సమయానికి పూర్తి చేయబడుతుంది.
పరిశుద్ద గ్రంధం అయిన బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం చాలా ఆశ్చర్యమైనది. ఒక ఇంటి యజమానుడు ద్రాక్ష తోటకు పని వాళ్ళను పెట్టుకున్నాడు. అప్పుడు ఉదయాన్నే బయలుదేరి మూడవ గంట, ఆరవ గంట తొమ్మిదవ గంట, పదకొండవ గంట వరకు పని వాళ్ళను వెతుకుతూ ఉన్నారు. పదకొండవ గంట సమయం వచ్చినప్పుడు కాళీగా నిలబడిన వాళ్ళను చూసి మీరు పగలు అంత ఇక్కడ కాళీగా ఎందుకు ఉన్నారు అని అడుగుతున్నారు. తరువాత ఆయన వాళ్ళను పిలుచుకొని వెళ్లారు. వాళ్లకు న్యాయమైన కూలి ఇచ్చారు. ఇలాగు వారు కాళీగా ఉండుట మాని యజమానుని మాటకు లోబడి కనీసం గంట సమయమైన పని చేసి దానికి తగిన ఫలితాన్ని పొందుకొని సంతోషంతో తిరిగి వెళ్లారు.
స్నేహితులరా! మన దేవుడు హృదయ ఆలోచనలు ఏరిగిన వాడు మనము పగటి వేళలో కాళీగా ఉండుట దేవుడు ఎంత మాత్రం ఇష్టపడరు. ఏదైనా దేవుని కొరకు చేస్తూ ఉండాలి. మన యొక్క తెలివితేటలు, సామర్ధ్యాలు ఏదో మనకు ఏది తెలుసో దానిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేస్తూ ఉండాలి. నూతనముగా వచ్చిన ఈ కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందాం. మనము చేయగలిగినఅంత దేవుని కొరకు వ్రాస్తాం, పాడదాం, ప్రయాస పడదాం, ఇస్తాం, దేవుని గూర్చి ఇతరులకు చెబుదాం. కాని కాళీగా ఉండ కూడదు అని నిర్ణయం తీసుకుందాం. సేవకులకు చేయూత ఇద్దాం. దేవుని రాజ్యము విస్తరించుటకు సహాయపడదాం. మీరు ఏ పని చేసిన వారైనా సరే కనీసం ఒక గంట అయిన కేటాయించి దేశం కొరకు ప్రార్ధించ వచ్చు గదా.
- బ్రదర్. టి.శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
క్రిస్మస్ కార్యక్రమాలు ద్వారా సందింప బడిన ఆత్మల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250