Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.01.2022
Share:

By Village Missionary Movement

Saturday, 08-Jan-2022

దిన ధ్యానము(Telugu) 08.01.2022

 

అంశం:- యేసుతో ప్రారంభించుము.

 

"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున" - హెబ్రీయులకు 12:1

 

ఒక కన్వెన్షన్ సభలో అనేక మంది ప్రజలు గుమికుడి యున్నారు. అక్కడ ప్రసిద్ధిగాంచిన ప్రసంగికులు ఒకరు ప్రసంగానికి పిలువబడి యున్నారు. ఆయన సందేశం ప్రారంభం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే అందరిని లేచి నిలబడి యేసు యేసు అని చెప్పి పిలవమని చెప్పారు. దీనిని చూసిన కొందరు మీరెందుకు ప్రసంగం చెయ్యడం మానేసి చిన్న పిల్లవాడి వలె నడుచుకుంటున్నారు అని అడిగారు. ఇలాగ ఒక 5 నిమిషాలు గడిచాయి. తరువాత ఆ మీటింగ్ స్థలం అంత దేవుని మహిమతో నింపబడింది. ఆ గుంపులో ఉండిన అనేకులలో నుండి అపవిత్రాత్మలు బయటకు వచ్చాయి. అనేకులలో ఉండిన రోగములు స్వస్థపరచ బడ్డాయి. అనేకులు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తరువాత దేవుని సహాయంతో చక్కగా ఆయన ప్రసంగం చేశారు. 

 

యేసుక్రీస్తు మనకోరకు ఒక మంచి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నారు. అదేమిటి అంటే విశ్వాసమును కర్త అయిన ఆయన దానిని ప్రారంభించుటకు సహాయం చేస్తున్నారు. అవును బైబిల్ అంత కూడా తన పరుగులో దేవుని కొరకు జయముగా ముగించిన వారి యొక్క జీవితంలో బలహీనతలు, నిరుత్సాహం, ఇరుకులు అని అనేక కష్ట కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాళ్ళు జయించ గలిగారు అంటే తమ నిరుత్సాహన్ని, తమ పరిస్థితిని దేవుని యొద్ద ఒప్పుకొని పరిశుద్దాత్ముని సహాయం పొందుకొని ధైర్యంతో ముందుకు వెళ్లి తమ పరుగును ముగించారు. వాళ్ళు అలా పరిగెత్తినప్పుడు అనేకులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి దూషించి, హింసించి, ఇబ్బంది పెట్టి హేళన చేసి ఉండి ఉంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వాళ్ళు దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళారు, వాళ్ళు సిగ్గుపడలేదు. వాళ్ళు పడిపోయినను వాళ్ళను నిలవబెట్టి వాళ్లకు విజయాన్ని ఇస్తున్న దేవుడు వాళ్ళతోనే ఉన్నారు. 

 

ప్రియమైన వారలారా! ఈ సంవత్సరం ప్రారంభంలో ఉంటున్న మీరు కూడా అనేక నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. మంచిది దేవుడు మిమ్మును దీవించును గాక! ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. దీనికి ముందు ఉన్న సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాల్లో అపజయములు పొంది ఉండవచ్చు కాని నిరుత్సాహ పడిపోకండి. పైన మనం విన్న ప్రసంగి వలె యేసుక్రీస్తుని ముందు పెట్టి ఆయన కొరకు సమస్తాన్ని చేయండి. విశ్వాసాన్ని ప్రారంభించిన ఆయన మీ కొరకు విజయపు స్తంభాన్ని ముందు పెడతారు. 

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.

 

ప్రార్ధన అంశం:-

మోక్ష ప్రయాణం అనే మ్యాగజైన్ ముద్రించ బడుటకు ప్రతి నెల చాలా ధనం అవసరమై ఉంది కాబట్టి ఆ అవసరతను దేవుడు తీర్చు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet