Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.01.2022
Share:

By Village Missionary Movement

Thursday, 06-Jan-2022

దిన ధ్యానము(Telugu) 06.01.2022

 

అంశం:- తెగించిన వాడు.

 

"ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను" - అపో.కార్యములు 7:56

 

క్రిమియన్ యుద్ధంలో బ్రిటీష్ వాళ్ళు విజయం పొందారు. లండన్ మహా పట్టణమే ఆనందంతో నిండిపోయింది. విక్టోరియా మహారాణి యుద్దములో సాహసములు చేసిన యోధులకు స్వర్ణ పథకం ఇచ్చి గౌరవించారు. కొంతమంది సైనికులు అయితే చేతులకు కాళ్ళకు కట్లు వేసుకొని మరికొంత మంది చేతికర్ర ఆధారంగా అక్కడికి వచ్చారు. ఒక చిరు నవ్వుతో విక్టోరియా మహారాణి అందరికి బహుమతులు అందిస్తున్నారు. చివరిగా ఒక మనిషిని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారు. ఆయన యుద్ధంలో యుద్ధం చేసిన యోధుడు. ఆ యుద్ధంలో తన రెండు చేతులను కాళ్ళను కోల్పోయాడు. ఆయన ముఖము కూడా పూర్తిగా దెబ్బతింది. చూచుటకు అసహ్యంగా కూడా కనిపించింది. 

 

విక్టోరియా మహారాణి గంభీరముతో ఆయన దగ్గరకు వెళ్లారు. పెద్ద స్వర్ణ పతకాన్ని ఆయనకు ఇచ్చారు. అది మాత్రమే కాదు వంగి ఆయన నుదుటిపై ముద్దు పెట్టి భళా నమ్మకమైన సేవకుడా అని పిలిచారు. ఆయన హృదయం సంతోషంతో నిండిపోయింది వేదనలు అన్నీ కూడా మర్చిపోయాడు. స్టీఫెన్ కూడా రాళ్లతో కొట్టబడి తన శరీరం అంతా రక్తం కారుతూ వేదనతో ఆకాశాన్ని తేరిచూసి నప్పుడు దేవుని కుడి పార్శములో యేసుక్రీస్తు నిలిచి యుండుట చూచి నప్పుడు ఆయన స్టీఫెన్ను ఆహ్వానించినట్లు ఆ దృశ్యము ఉంది. అప్పుడు ప్రభువైన యేసు నా ఆత్మను సమర్పిస్తున్నాను అని ఆయన ప్రార్ధించాడు. 

 

దీనిని చదువుతున్న స్నేహితులారా! ఈ దినం మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉన్నది ఆలోచించి చూద్దాం. దేవుని రాజ్యం ఈ భూలోకంలో స్థాపించబడుటకు మనం తెగించి ధైర్యంతో నిలబడవలసినది చాలా అవసరం. మనం ఉంటున్న స్థలాల్లో, పని చేస్తున్న స్థలాల్లో యేసుక్రీస్తు యొక్క నామం ప్రకటించబడుటకు మరియు మహిమ పరచబడుటకు మనం దేనిని కోల్పోయిన పరవాలేదు అని తెగించి సాక్షిగా నిలబడదాం. ఒక దేశం యొక్క విజయం కొరకు ఒక మనిషి తన చేతులను కాళ్ళను కోల్పోవుటకు తెగించి నట్లయితే మరి మన దేవుని పరలోక రాజ్యం యొక్క మేలు కొరకు మనము ఏ కార్యాన్ని అయిన కోల్పోవుటకు సిద్ధంగా తెగించి నిలబడదాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్

 

ప్రార్థన అంశం:-

వి.ఎమ్.ఎమ్. వ్యవస్థాపకులు అయిన డేవిడ్ గణేషన్ గారిని దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al