Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.01.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 05-Jan-2022

దిన ధ్యానము(Telugu) 05.01.2022

 

అంశం:- " నూతనక్రియ"

 

"ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును...." - యెషయా 43:19

 

70 సంవత్సరాలకు మునుపు జరిగిన నిజ సంఘటన. జోసెఫ్, క్రిస్టీ పద్మ దంపతులకు ఇంచుమించు 12 సంవత్సరాలుగా పిల్లలు లేరు. డాక్టర్లు మీకు ఇక పిల్లలు పుట్టరు అని చెప్పారు. జోసెఫ్ యొక్క అక్క , ఎబినేజర్ అనే పరిచర్య చేస్తున్న తల్లిగారిని తన తమ్ముడు ఇంటికి పంపించి ప్రార్థన చెయ్యమని చెప్పారు. ఎబినేజర్ అమ్మ అయితే జోసెఫ్ క్రిస్టీ వాళ్ళ తల మీద చేతులుంచి ప్రార్ధించారు. తరువాత 10వ నెలలో మీకు ఒక అమ్మాయి పుడుతుంది అని చెప్పారు. యేసుని ఎరగని కుటుంబంలో పుట్టి పెరిగిన క్రిస్టి పద్మ యేసుక్రీస్తు నాకు బిడ్డను ఇస్తారు అని విశ్వసించింది. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన జోసెఫ్ అయితే డాక్టర్లు బిడ్డలు పుట్టరు అని చెప్పారు కానీ ఈ అమ్మ తల మీద చేతులు పెడితే బిడ్డ వచ్చేస్తాదా? 10వ నెలలో ఆడపిల్ల పుడుతుంది అని చెప్పారు. సరే నేను ఈ తారీఖు రాసి పెడతాను అని అన్నారు. దేవుడు చెప్పినది చెప్పినదే. క్రిస్టి గర్భం దాల్చింది 10వ నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విశ్వాసమును పాలు వలె పోస్తూ పెంచింది. భవిష్యత్తులో ఆ బిడ్డ ఒక గొప్ప సేవకురాలుగా మారింది. 

 

మీ యొక్క జీవితంలోనూ ఎన్నో ఆవసరతలు ఉండవచ్చు, తీరని రోగం, అప్పులు వారి యొక్క ఒత్తిడి, కుమారుడికి పని లేదు , కుమార్తెకు వివాహం అని ఎన్నో ఆవసరతలు ఉండవచ్చు. కలత చెందకండి. దేవుని పైన ఆనుకొని మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించుడి. ఆవసరతలు గురించి సణుగుకొనకుండా ఆయన చేసిన మరియు చేయబోతున్న మేలులు కొరకు కృతజ్ఞత నిండిన హృదయంతో ఆయనను స్తుతించుడి. 

 

అరణ్యంలో త్రోవను, ఎడారిలో నదులను మన దేవుడు సృష్టించగలరు. గొర్రెలు కాచిన దావీదును ఇజ్రాయేలీయుల మీద గొప్ప రాజుగా చేశారు. అనాధగా ఉండిన ఎస్తేరు 127 దేశాలకు రాణి అయ్యింది. అన్యదేశానికి చెందిన రూతు యేసుక్రీస్తు సంతతిలో చోటు దక్కించుకున్నది. వాళ్ళను హెచ్చించిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో కూడా నూతన కార్యాన్ని చేసి అద్భుతంగా సహాయం చేస్తారు.

- శ్రీమతి. వనజా పాల్ రాజ్

 

ప్రార్థన అంశం:-

ఈ నూతన సంవత్సరంలో పరిచర్య యొక్క సరిహద్దులు విశాల పరిచేటట్లు దేవుడు ఇచ్చే ప్రణాళికలు ఆటంకం లేకుండా జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al