By Village Missionary Movement
Tuesday, 04-Jan-2022దిన ధ్యానము(Telugu) 04.01.2022
అంశం:- సహాయకుడు.
"...భయపడకుము నేను నీకు సహాయము చేసెదను" - యెషయా 41:13
జాన్ అనే బాలుడు తన ఇంటి మేడమీద ఎక్కి అన్నివైపుల చూస్తూ అడుకుంటున్నాడు. హఠాత్తుగా పొగలు రావడం ప్రారంభించాయి. తండ్రి క్రిందకు దూకుము అన్నారు. వెంటనే జాన్ మారు మాట చెప్పకుండా క్రిందకు దుకేసాడు. తండ్రి పెద్ద నెట్ క్రింద పట్టుకొని యున్నారు. ఎందుకు అంటే కరెంట్ స్తంభం పై షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్ని ప్రమాదానికి గురైయింది. కాబట్టి వాడిని కాపాడుటకు తండ్రి ఇలా పిలిచాడు. అక్కడ ఉన్న ప్రజలు ఎలా క్రిందకు దూకావు అని జాన్ ని అడిగారు. క్రిందకు దూకుము అని నా తండ్రి స్వరము వినబడింది, నా తండ్రి నన్ను సంరక్షించే వాడు. తప్పిదముగా ఏది చెప్పరు అని అన్నాడు. మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో చెప్పిన కార్యములను ఉన్నది వున్నట్లుగా విశ్వసించినట్లు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం. పాపమునుండి, ప్రమాదం నుండి తప్పించ గలం.ఈ దినము కూడా దేవుడు మన కుడి హస్తమును పట్టుకొని నేను నీకు తోడై యున్నను అని చెబుతున్నారు. ఈ సంవత్సరం అంతా మన దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే ఎంత సంతోషం. ఈ సంవత్సరం అంతా దేవుడే మన సహాయకుడు అని నమ్మి విశ్వసించిన యెడల ఆయన సమస్త కార్యాములకు సహాయకునిగా ఉండి మనలను నడిపిస్తారు. మనుష్యులను నమ్మిన కొన్ని కార్యములు వారు చెయ్యలేరు. కాని మన దేవున్ని సహాయకునిగా పెట్టుకొనిన యెడల ఆయన సర్వ శక్తిమంతుడు. సమస్త కార్యములను సులువుగా, మేలుగా చేసి ముగిస్తారు. దేవుడు మనకు సహాయకుడిగా ఉండిన యెడల అది ఎంత బలము.
ప్రియమైన వారలారా! ఈ. సంవత్సరాన్ని ఎలాగు ఎదుర్కోవాలి? ఈ సంవత్సరం అంతా ఇదే బలహీనతతో ఉండాలా? ఈ పరిస్థితి మారదా? అని ప్రశ్నలతో ఉన్నారా? మిమ్మల్ని చూసిన దేవుడు మీ కుడి హస్తం పట్టుకొని భయపడకుము నేను మీకు తోడైయున్నాను అని అంటున్నారు. ఆయన మీకు సహాయకునిగా ఉండిన యెడల మీరు ఎలాంటి సమస్యనైనా మీరు ఎదుర్కొన గలరు ఎందుకు అంటే మన దేవుడు సర్వ శక్తిమంతుడు. ఆయన ముందు ఉన్న సమస్య ఏదైనా చిన్నదిగానే కనిపిస్తుంది. సర్వ శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఈ మాటలు పట్టుకొని ప్రార్ధించి మన జీవితంలో ముందుకు వెళదాం విజయాన్ని పొందుకుందాం. ఆమెన్.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.
ప్రార్థన అంశం:-
మన దర్శనం ప్రకారం పరిచర్య అంతటితో పరిశుద్దత కనబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250