Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 3.01.2022
Share:

By Village Missionary Movement

Monday, 03-Jan-2022

దిన ధ్యానము(Telugu) 3.01.2022

 

అంశం:- యెహోవా పరిశుద్ధుడు.

 

"ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లెములమీద యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును" - జెకర్యా 14: 20

 

మన యెహోవా పరిశుద్ధుడు, ఆయన నివసించే స్థలము పరిశుద్ద స్థలము. ఆయన ఎల్లలు అన్ని కూడా పరిశుద్ధతతో నిండి ఉంటాయి. మన దేవుడు పని చెయ్యాలి అంటే పరిశుద్ధతే ప్రధానమైన కార్యముగా ఉంటుంది. దేవునికి ప్రియమైనది పరిశుద్ధత అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధత ఏమిటి అని తెలుసుకోవాలి అంటే దేవుడు ఎలాంటి వారో తెలుసుకోవాలి. పరిశుద్ధత ఎక్కడ ఉందో మన దేవుడు అక్కడే ఉన్నారు. మన దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడే పరిశుద్ధత ఉంటుంది. మన దేవున్ని మరియు పరిశుద్ధతను వేరువేరుగా చూడలేం. పరిశుద్ధత అనేది బైబిల్లో 587 సార్లు వ్రాయబడి ఉంది. 

 

మిక్కిలి ప్రసిద్ధి గాంచిన వయోలిన్ కళాకారుడు ఇస్సాక్ బెయిల్ మెన్ అనే వ్యక్తి గురించి వ్రాయుటకు మాటలు దొరకక ఇబ్బంది పడ్డారంట. వయోలిన్ వాయించుటకు వాడబడుతున్న ఆ పొడవాటి కర్ర ద్వారా పైకి క్రిందకి లాగుతూ ఉన్నప్పుడు మ్యూజిక్ ఎంత ఇంపైనదిగా ఉంటుంది. ఆయన మ్యూజిక్ మాట్లాడుతున్నట్లు ఎవరో మనకు జవాబు ఇచ్చినట్లు మరియు సమస్త బాధలకు జవాబు ఇచ్చినట్లు అనిపిస్తుంది అని ఆయన గురించి పొగుడుతూ వ్రాస్తున్నారు. మన దేవున్ని ఎవరైనా ఇలాగు పొగుడుతున్నారా అని వెతికాను అని గొప్ప సేవకుడు ఒకరు చెబుతున్నారు. పరిశుద్ద బైబిల్లో మన దేవుని గురించి అనేక చోట్ల వ్రాయబడి ఉండుట చదవగలం. దేవునికి దూరంగా ఉండేటప్పుడు అనేకులు దేవుని గొప్ప తనాన్ని పొగుడుతూ ఉంటారు మరియు ఆయన దగ్గరకు చేరినప్పుడు ఆయనను వారు తమ చేతులతో నోటిని కప్పుకొని ఉండిపోతారు. అయ్యో నేను చచ్చినట్లు అయిపోయాను అని ఆయనను చూసిన ప్రవక్తలు చెప్పడం మనం బైబిల్లో చూడగలం. దేవుని దూతలు ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళను, ముఖమును రెక్కలతో కప్పుకొని పరిశుద్ధతతో మహోన్నతమైన దేవున్ని మహిమ పరుస్తున్నారు. 

 

పరిశుద్ధుల గుంపుల మధ్యలో మెరుస్తున్న జోతిర్మయుడైన యేసుక్రీస్తుని త్వరగా మనం దర్శించబోతున్నాం. అక్కడ మనం పరిశుద్ధతను గుర్తుంచుకొని కొనియాడబోతున్నాం. నేను మిమ్మల్ని పరిశుద్ద పరుస్తున్న దేవుడను అని మనతో మాట్లాడు దేవుడు మనలను పరిశుద్ధతలో నడిపిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ద నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక!. ఆమెన్.

- బ్రదర్. పి. జాకబ్ శంకర్.

 

ప్రార్థన అంశం:-

పరిశుద్ధతలో ఎదుగుతున్న సంవత్సరంగా అనుసరిస్తున్న ఈ సంవత్సరం సేవకులు మరియు సేవలో పాల్గొన్న అందరూ కూడా పరిశుద్ధతలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al