Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.01.2022
Share:

By Village Missionary Movement

Saturday, 01-Jan-2022

దిన ధ్యానము(Telugu) 01.01.2022

 

అంశం:- సంతోషకరమైన ప్రారంభం.

 

"మరియు యెహోషువరేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్య ములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను" - యెహోషువ 3: 5

 

1870- 1871 సంవత్సరాలలో ప్రాన్స్ మరియు జర్మనీ దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ సమయం ఒక మనుష్యుడు పేలని రెండు బాంబులను తెలియక ఇంట్లో పెట్టుకొని వాటి పక్కనే అగ్నితో చలి కాస్తూఉన్నాడు. అనేక దినముల తరువాత ఆయన ఇంటికి పేలుడు పదార్ధము గూర్చి చదువుకున్న వ్యక్తి ఆయన ఇంటికి వచ్చారు. పేలని ఆ రెండు బాంబులు తన స్నేహితుని యొక్క ఇంట్లో చూచి ఆశ్చర్య పోయాడు. తన స్నేహితునికి వాటి గూర్చి మరియు వాటి యొక్క ప్రభావము గూర్చి వివరించాడు. వెంటనే ఆ బాంబులను అక్కడ నుండి తీసివేసాడు.

 

కొన్ని సమయాల్లో మన దగ్గర ఉంటున్న కార్యములు మనం గ్రహించ కుండా ఉంటున్నాం. మనలను పాడు చేస్తున్న కొన్ని కార్యములను మన నుండి దూరం చేసినప్పుడే మనకు ఆరోగ్యం మరియు సమాధానం దొరుకుతుంది. అరణ్య ప్రయాణంలో యాకోబు తనతో ఉండిన అన్యదేవతలను తీసివేసి మీ వస్త్రములను శుభ్రపరచుకోమని అంటున్నాడు (అదికాండం 35:1-4). ఇలాగే 1 సమూయేలు 7వ అధ్యాయంలో కూడా దేవుడు సమూయేలు ఇశ్రాయేలియులను బాగుచేసి వారిని పరిశుద్ధతలో నడిపించుట మనం చూస్తున్నాం. మన యొద్ద ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యములను విడిచి పరిశుద్ధత వైపుకు తిరిగిన యెడల ఎన్నో అద్బుతములను మనం అనుభవించగలము. 

 

ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యతను నూతనంగా పొందుకున్న యెహోషువతో మీకు అద్భుతం కావాలి అంటే మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనుడి అని ప్రభువు సెలవు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మీకు శ్రేష్ఠమైన కార్యములు జరగాలి అంటే పరిశుద్ధత ఒకటే మార్గం అని బైబిల్ చెబుతుంది. ఇతరులను చూడవద్దు మనలను మనము సరిచేసుకొని పనిలో మనస్సు పెట్టండి. బాంబ్ వలె పేలిపోయి మనలను పాడుచేయగలిగిన పాపములు ఏవేవి ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించి వాటిని మన యొద్దనుండి దూరం చేద్దాం.

 

లోకాశలు, టైం పాస్ అనే పేరుతో సమయాన్ని వ్యర్థ పరుచుట, ఎదుటి వ్యక్తులతో అవసరం లేని బంధాలను, మాటలు అని ఎన్నో కార్యములు గూర్చి చెప్పుకొని వెళ్ళవచ్చు. మన దేవుడు పరిశుద్ధతను కోరుకునే దేవుడు కాబట్టి పరిశుద్ధతను ఆశించి, ప్రేమించి మీరు విడిచి పెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. రోజు మీ పరిమితిలో దేవుని యొక్క అద్బుతములను మీరు చూస్తారు. ఈ సంవత్సరం పరిశుద్ధతలో ఎదుగుట అనే సంవత్సరంగా మనం అనుసరిస్తున్నాం. అనుదినము మనం పరిశుద్ధతలో విస్తరించి దీవించబడదాం.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

ఈ నూతన సంవత్సరంలో మనము చేస్తున్న పరిచర్యను దేవుడు మనతో ఉండి చక్కగా జరిగించులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet