By Village Missionary Movement
Friday, 31-Dec-2021దిన ధ్యానము(Telugu) 31.12.2021
అంశం:- వందనాలు చెల్లించే సమయం ఇది.
"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తనలు 103:2
2021వ సంవత్సరం చివరి దినాల్లో ఉన్న మనము మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్ధులై యున్నాము. 2020 మార్చి నెలలో మనలను భయ పెట్టి మనలో అనేకులను బలి తీసుకొని 2021లోను కొనసాగుతూ వచ్చింది కరోనా అనే మహమ్మారి. కాని మీరు నేను ఇంకను సజీవులుగా, ఆరోగ్యంగా ఉండుటకు దేవుడు సహాయం చేసాడు. కృతజ్ఞత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిస్థితుల్లో నా సాక్ష్యాన్ని మీతో పంచుకొనుటకు నేను చాలా సంతోషిస్తున్నాను.
నా యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి నా తమ్ముడు చెల్లెలను దేవుడు నడిపించిన విధానాన్ని ప్రతి రోజు గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒంటరి దానినైన నాకు 37వ సంవత్సరంలో వివాహం జరిపించి ఒక ఇంటి ఇల్లలుగా పంపించారు. తరువాత దేవుని పరిచర్య చేయుటకు సహాయం చూపించారు. రెండు సంవత్సరాలు సంతానం లేకుండా 40వ సంవత్సరంలో ఒక అడ బిడ్డను మరియు 42వ సంవత్సరంలో ఒక మగ బిడ్డను ఇచ్చి వాళ్ళను పెంచి పెద్దగా చేయుటకు కృప చూపించారు. దానిని తలంచి ప్రతి క్షణం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్నాను. నేను నశించపోకుండా ఉండుట ఆయన కృపయే.
నా శ్రమల, ఇరుకుల ద్వారా దేవుడు నాకు అనేక ఆశీర్వదములు, మేలులను ఇచ్చారు. నేను ఇతరులకు ప్రార్ధించుట నేర్పించాను మరియు తల్లిదండ్రులు లేని పిల్లలు, వివాహం కాని యవ్వనస్తురాలైన పిల్లలకు, పిల్లలు విడిచిపెట్టేసిన తల్లిదండ్రులకు ఇలా వీళ్ళందరి కొరకు భారం కలిగి ప్రార్ధించే ప్రార్థన ఆత్మను నాకు దేవుడు దయచేసి ప్రార్ధించుటకు సహాయం చేస్తున్నారు. మనము ఇంత వరకు ఎన్నో దుఃఖలు, వేదనలు, శ్రమలు గుండా వెళ్లి యుండవచ్చు. కాని మనము సజీవులుగా ఉంచిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవద్దా? అన్ని వేళల్లో మనము ఎదురుచూసినది జరుగకపోయిన ఆయన మనలను ఎత్తి పట్టుకొని మోసుకొని నడిపిస్తు వస్తున్నారు. కాబట్టి ఎప్పుడు సమస్త కార్యముల కొరకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేనిని ఉద్దేశించి దేవుడు ఈ సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరం లోనికి నడిపిస్తున్నారో దానిని నెర వేర్చుటకు సమర్పించుకొని ప్రార్థిద్దాం. దేవుని యొక్క సమాధానంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు దేవుడు మనకు కృప చూపించును గాక!
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్.
ప్రార్థన అంశం:-
వచ్చే 2022లో దేవుని దయ మనలను ఆదరించి దేవుడు దయచేసిన ప్రాణాళికల్లో దేవుడు మనలను నడిపించు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250