Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.12.2021
Share:

By Village Missionary Movement

Thursday, 30-Dec-2021

దిన ధ్యానము(Telugu) 30.12.2021

 

అంశం:- విమర్శించి తెలుసుకుందాం.

 

"అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము" - 1కోరింథీయులకు 11:31

 

దేవుడు మనకు ఎంత చక్కటి జీవితాన్ని దయచేసి యున్నారు. కానీ ఆ జీవితంలో కూడా ఎన్నో సణుగులు. జీవితం యొక్క విలువ తెలియకుండా ఎన్నో సార్లు నిరుత్సాహం చెందుతాము. మనం ప్రతి దినం ఉదయాన్నే లేచినప్పుడు 86400 సెకండ్లు మనకు దేవుడు దయచేస్తున్నాడు. అలా అయితే సంవత్సరానికి ఎన్ని సెకెండ్లు? 86400x365=31536000. ఇంత పెద్ద మొత్తం ధనం మన చేతికి ఇచ్చిన యెడల బహు శ్రద్ధతో ఖర్చు పెడతాం. అలానే ఖర్చు పెట్టని ధనం మన దగ్గర ఉంటుంది కాని ఖర్చు పెట్టని సెకెండ్లు మన యొద్ద దాచుకోవడం జరగదు. వాటన్నింటిని మరల పొందుకోలేము కూడా. కాబట్టి ధనము కంటే విలువ కలిగినది ప్రతి రోజు దేవుడు మనకు ఇచ్చిన 86400 సెకెండ్లు దానిని మనము ఏమి చేస్తున్నాము అని ఆలోచిద్దాం. ఒక సంవత్సరంలో ఉన్న గంటలు 8760 గంటలు వాటిలో పని చేయుటకు 2920గంటలు మరియు నిద్ర పోవుటకు 2920 గంటలు ఇలా మిగిలినవి 2920 గంటలు. ఇలా దేవుడు ఎంత సమానంగా విభజించి ఇచ్చాడో చూడండి. ఇలా మిగిలిన సమయాన్ని దేవుడు మనకు నిత్యత్వమునకు సిద్ధపడుటకు దయ చేసి యున్నారు. ఈ సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం ఆలోచిద్దాం.

 

మనలను మనమే విమర్శించు కొనిన యెడల తీర్పు పొందక పోవుదము అని బైబిల్ చెబుతుంది. బైబిల్లో మన హృదయం కేంద్రీకృతం చేసినప్పుడు మనం మనగురించి తెలుసుకోగలం. ఈ సంవత్సరంలో మనం బైబిల్ ధ్యానము, ప్రార్థన, ఇతరులతో ఉన్న బంధం, చదువు, ఇంటి పనులలో కేటాయించిన సమయం మనము క్రీస్తు శిష్యుడిగా, శిష్యురాలిగా ఏమి చేసాము, దేనిని అభివృద్ధి చేసాము వీటిలో ఏదైనా ఎదుగుదల ఉందా? లేనియెడల ఇంత సమయాన్ని వ్యర్థం చేసినట్లే. గ్రహింపు గల వారిగా దేవుని యొద్ద క్షమాపణ అడుగుదాం. మనలను మనం సరిచేసుకుందాం. దింట్లో ఏదోఒక దాంట్లో అభివృద్ధి చెందుటకు ప్రణాళిక వేసుకుందాం. 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

 

ప్రార్థన అంశం:-

ఈ 2021 వ సంవత్సరం అంత కూడా దేవుడు మనలను కనుపాప వలె సంరక్షించి కాపాడి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet