By Village Missionary Movement
Wednesday, 29-Dec-2021దిన ధ్యానము(Telugu) 29.12.2021
అంశం:- ఇలాగు కూడా సవాలా?
"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" - యోహాను 1: 9
స్టీఫెన్ మరియు శ్యామ్ ఇద్దరు కూడా యవ్వనస్తులు. ఆ సంవత్సర ప్రారంభంలో ఇద్దరు ఒక సవాలును పెట్టుకున్నారు. ఏమిటి ఆ సవాలు అంటే ఒక సంవత్సరంలో 100 మంది అమ్మాయిలను స్నేహితులుగా చేసి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు తీసుకోవడం అన్నదే. స్టీఫెన్ యేసయ్యను ప్రేమించే యవ్వనస్తుడే ఆయన మీద ఎక్కువుగా ప్రేమ చూసిపిస్తున్న వ్యక్తి. అయినప్పటికీ తప్పిపోయిన కుమారుని వలె సవాలును అంగీకరించారు. అంత మాత్రమే కాక ఆయన ఏం చెప్పాడో తెలుసా? చూడండి ఈ సవాల్లో నేనే గెలుస్తా అన్నదే. ఇందుకొరకు అనేక కార్యములు చెయ్యడం ప్రారంభించాడు. ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్, క్యారక్టర్ అన్ని కూడా అమ్మాయిలు చూడాలి ఆకర్షించాలి అనే ఉద్దేశ్యంతో అన్నింటినీ మార్చుకున్నాడు. ఆ దినము నుండి యేసయ్యను మర్చిపోయాడు కానీ యేసయ్య మాత్రం అతనిని మర్చిపోలేదు. ఎందుకు అంటే లూకా 15:20 ప్రకారం యేసు యదార్థముగా ఉన్నారు. స్టీఫెన్ 7 నెలల్లో 76 మంది అమ్మాయిలతో స్నేహం పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఇదే ధ్యాసతో ఉండే వాడు. ఈ విషయంలో ఆయన చాలా తెలివైన వాడిగా మారిపోయాడు. ఇదే డిసెంబర్ 29వ తారీఖున యేసయ్య స్టీఫెన్ తో మాట్లాడడం ప్రారంభించారు. ఆ దినము రాత్రి దేవుడు అతనితో మాట్లాడారు. నీ కొరకు నేను మరణించాను నా కొరకు నువ్వు ఏమి చేసి యున్నావు. నీ మీద నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. నువ్వు చెయ్యాలి అని పరిచర్య కూడా సిద్ధపరిచి యున్నను మరి నా కొరకు నువ్వు ఏమి చెయ్యబోతున్నావు అని తేటగా అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రభువు యొక్క మాటకు లోబడి తన మొబైల్లో గల సిమ్ ను తీసి పగల గొట్టేసాడు అదేవిధంగా ఆ రాత్రి అతనిని దేవుని హస్తములకు సమర్పించుకొన్నాడు. సౌలును పౌలుగా మార్చ గలిగిన దేవుడు మనలను కూడా మార్చగలరు. పత్రికలను చించిన వాడిని పత్రికలు వ్రాసేవాడిగా దేవుడు మార్చారు. ప్రభువు మరచి అమ్మాయిల స్నేహం కోసం తిరిగే ఆయనను దేవుడే వెదకి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన జీవితాన్ని మార్చివేశారు. పాపపు ఊబిలో ఉన్న వాడిని లేవనెత్తారు. ఇప్పుడు వి.ఎమ్.ఎమ్ పరిచర్యలో సంపూర్ణ సేవకునిగా పరిచర్య చేస్తూ ఉన్నాడు.
హితులారా! ఎలాంటి వ్యక్తినైనా కూడా ఆయన మార్చగలడు. ఎలాంటి మనస్సు గల మనిషినైన ఆయన మార్చగలరు. కానీ ఆ వ్యక్తిలో గల పాపాన్ని ఆయన తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నాను ఈ రోజే ఆయన వైపు చూడండి ఆయన మిమ్ములను విమోచించి వాడుకుంటారు.
- సిస్టర్. రోస్ లిన్
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీల ద్వారా లక్ష గ్రామాలు దర్శించే పరిచర్యలో సమర్పించ బడిన సేవకులు మనతో పాటు ఐక్యపరచబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250