Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.12.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 28-Dec-2021

దిన ధ్యానము(Telugu) 28.12.2021

 

అంశం:- ఎవరైనా పొందుకోవచ్చు.

 

"పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను... అట్టి వారిలో నేను ప్రధానుడను" - 1తిమోతికి 1:15

 

ఒక దినము ఒక యవ్వనస్తూ రాలైన ఒక స్త్రీకి సువార్త చెప్పుటకు ప్రయత్నం చేశాను. ఆమె తాను ఒక క్రైస్తవరాలు అని చెప్పింది. ఆమె యొద్ద ఇంకను మాట్లాడుతు రక్షింప బడ్డారా అని అడిగినప్పుడు ఆమె వెంటనే నేను ఎందుకు రక్షింపబడాలి అని అడిగింది. నేను పుట్టుకతోనే క్రైస్తవరాలను అలాగే క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నను కాబట్టి నా కెందుకు రక్షణ అవసరము అని అడిగింది. ఆమెకు రక్షణ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఆమె జవాబు చెప్పలేకపోయింది. అందుకు నేను యేసుక్రీస్తు సిలువ వేయబడి రక్తం కార్చి మరణించి మూడవ రోజు తిరిగి లేచారు. ఈ లోకంలోనే మన జీవితం ముగిసిన పోయిన యెడల యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశ్యం ప్రతి ఒక్కరు కూడా పాపక్షమపన పొందుకొని రక్షించబడాలి అన్నందుకే. కాబట్టి పాపములు నుండి విమోచింప బడిన వారు పరలోకానికి వెళ్తారు. అలాగే పాపములో ఉండిపోయిన యెడల నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాపముల నుండి విడిపించబడాలి అన్నదే దేవుని చిత్తమై ఉంది అన్నప్పుడు ఆమె చెప్పిన జవాబు నేను ఏ పాపము చెయ్యలేదే అని ఆమె చెప్పింది. బైబిల్ చెబుతుంది మనం పాపము లేని వారము అని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు (యోహాను 1:8). ఇది ఎరుగకుండా నాలో పాపము లేదు నేను ఎందుకు రక్షించబడాలి అని తలంచె అనేకులు ఉన్నారు. అలా కాదు మన యొద్ద ఉన్న పాపములను ఒప్పుకొని రక్షింపబడి ఉండాలి. 

 

ప్రియమైన వారలారా! ఈ దినము కూడా ఇలాంటి వాళ్ళు అనేకులు కలరు. మేము మరియు మా పితరులు అందరం కూడా క్రైస్తవులే అని చెబుతూ ఉంటారు. రక్షింప బడ్డారు అని అడిగినప్పుడు లేదు అంటారు. బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యోహాను 3:3 లో నికోదేముతో ఇలా చెబుతున్నారు. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. కాబట్టి పాపముల నుండి విమోచింపబడి క్రీస్తులో మరల జన్మించిన అనుభవము పొందుకుందాం. దీనిని చదువుతున్న మీరు కూడా రక్షింపబడి ఉన్నారా అనే దానిని రుజువు చేసుకోనండి. యేసుక్రీస్తు మీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రక్షణను ఎవరైనా పొందుకోవచ్చు కాబట్టి నూతన సంవత్సరం వరకు ఆలస్యం చెయ్యకండి, ఈ దినమే ఆ రక్షణను పొందుకొనుడి. 

- బ్రదర్. పి.వి.విలియమ్స్

 

ప్రార్థన అంశం:-

7000 మంది మిషనరీలు, ఒక లక్ష గ్రామాలు దర్శించే ప్రణాళికలో అన్ని రాష్ర్టాముల నుండి 12 మంది సేవకులను దేవుడు మనకు దయ చేయుటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet