Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.12.2021
Share:

By Village Missionary Movement

Monday, 27-Dec-2021

దిన ధ్యానము(Telugu) 27.12.2021

 

అంశం:- మూలకు తల రాయి.

 

"...ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను” - మత్తయి 21:42

 

ఇల్లు కట్టుటకు అనేక విధములైన కొలతల గల రాళ్లు అవసరమై ఉంటుంది. వాటిని సరైన కొలతలో పగులగొట్టి ఉంచుకుంటారు. ఇల్లు కట్టేవారికి ఏ రాయిని ఏ స్థానంలో పెడితే అది చక్కగా ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలుసు. అలాగే మనలను సృష్టించిన ప్రభువుకే మనలను ఏ స్థానములో ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలో తెలుసు. ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. అలాగే మూలకు తల రాయిగా అమర్చబడుతున్న రాయి అన్నది గోడ యొక్క రెండు పక్కలను పట్టుకో గలిగి మోయగలిగిన రాయిగా ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు దేవున్ని మరియు మానవులను కలుపుతున్న తల రాయిగా వుంటున్నారు. 

 

ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు, సద్దుకయ్యులు చేత నిషేదించబడిన వ్యక్తి యేసుక్రీస్తే. రక్షణకు కర్త అయిన లోక ప్రజల పాపములను మోయుటకు బలియాగము అయ్యారు. యూదుల చేత త్రోసివేయబడిన రాయి వలె ఉండినది ఆయనే. ఆయన మూలకు తల రాయిగా హెచ్చింపబడి నిలబడ్డారు. ఇది దేవుని యొక్క దినత్వానికి, విధేయతకు దొరికిన బహుమానం అని చెప్పవచ్చు. 

 

ప్రియ సహోదరి, సహోదరులారా మీరు కూడా మీ కుటుంబాలల్లో పని స్థలాల్లో ఎందుకు ప్రయోజనం లేని రాయి వలె ఉంచబడి యున్నారా? వీరు ప్రయోజనం లేని వారు లేదా ఏ పని చెయ్యడం చేతకాని వారు అని ముద్రించబడి యున్నారా? యూదుల చేత, ఇతరుల చేత నిషేదించబడిన రాయి వలె ఉండిన యేసయ్య సమస్త మానవాళికి రక్షకునిగా హెచ్చించబడ్డారు. మిమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులు ఇతరుల మధ్య హెచ్చించుటకు ఆయన శక్తిమంతుడై యున్నారు.

 

యాకోబు మొదటి భార్య అయిన లేయా భర్త అయిన యాకోబు చేత ఆమె సహోదరి అయిన రాహేలు చేత తృణీకరించబడింది. భర్త ప్రేమ దొరకలేదు అలాగే తోబుట్టు అయిన సహోదరి ప్రేమ దొరకలేదు అయినా గాని దేవుడు ఆమెను తిరస్కరించలేదు. ఆమెకు గర్భ ఫలములను ఇస్తూ సంతోషింప చేసారు. ఆమె కనిన యూదా వంశంలోనే యేసుక్రీస్తు జన్మించారు. అవును త్రోసివేయబడిన పరిస్థితుల్లో ఉన్న ఎవరినైనను హెచ్చించుట దేవునికి సాధ్యమే. కాబట్టి మనము త్రోసివేయబడిన పరిస్థితుల్లో ఉండిన యెడల దేవుని వైపు చూద్దాం ఆయన మనలను హెచ్చించి దీవిస్తారు. ఆమెన్, హల్లెలూయా.

- శ్రీమతి. భువన ధనబాలన్

 

ప్రార్థన అంశం:

ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించే సాక్షిగా మరేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al